పక్కా మాస్ టైటిల్‌తో వెంకటేశ్ `అసురన్`
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళంలో ధనుష్ హీరోగా నటించిన చిత్రం `అసురన్`. వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేశ్ హీరోగా రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్లు` ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే సెట్స్‌కు వెళ్లబోయే ఈ సినిమా కోసం వెంకటేశ్ తన లుక్‌ను మార్చుకున్నాడు. వెంకటేశ్ సరసన కన్నడ హీరోయిన్ ప్రియమణి నటించనుంది.
వీరిద్దరి కాంబినేషన్లో రూపొందనున్న తొలి చిత్రమిదే. ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి ఓ వార్తొకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఈ సినిమాకు తెలుగులో `నారప్`ప అనే పక్కా మాస్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. భూ వివాదాల నేపథ్యంలో సినిమా తెరకెక్కనుంది. తెలుగులో ఈ చిత్రాన్ని డి.సురేష్‌బాబు, కలైపులి థాను నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుంది. అనంతపురం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అలాగే వెంకటేశ్ కొడుకుగా నటించే యువ హీరో కోసం చిత్ర యూనిట్ అన్వేషణలో ఉందట. ఈ ఏడాది సమ్మర్లోనే సినిమాను విడుదల చేయాలనేది చిత్ర యూనిట్ ప్లాన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com