ఈ నెల 29న వస్తున్న ధనుష్ - కాజల్ 'మాస్'

  • IndiaGlitz, [Wednesday,April 27 2016]
ధనుష్- కాజల్ జంటగా తమిళంలో మంచి విజయం సాధించిన "మారి" తెలుగులో "మాస్" పేరుతో అనువాదమవుతుండడం తెలిసిందే. "వి. ఎం. అర్" సమర్పణలో జయప్రద పిక్చర్స్ పతాకంపై వాసిరెడ్డి పద్మాకరరావు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. "లవ్ ఫెయిల్యూర్" ఫేం బాలాజీ మోహన్ దర్సకత్వం వహించిన ఈ చిత్రానికి "వై దిస్ కొలవేరి ఫేం" అనిరుధ్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేస్తున్నారు.
నిర్మాత వాసిరెడ్డి పద్మాకరరావు మాట్లాడుతూ.. "ధనుష్ పెర్ఫార్మెన్స్, కాజల్ గ్లామర్, అనిరుధ్ మ్యూజిక్, సాహితి అందించిన మాటలు-పాటలు బాలాజీ మోహన్ స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం "మాస్" చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. మాస్ తో పాటు క్లాస్ ఆడియన్స్ నూ అమితంగా అలరించే చిత్రమిది. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. తెలుగులోనూ కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకముంది" అన్నారు.
విజయ్ ఏసుదాస్, రోబో శంకర్ తదిరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సమర్పణ: "వి.ఎం.ఆర్", నిర్మాత: వాసిరెడ్డి పద్మకరరావు, కథ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: బాలాజీ మోహన్ !!

More News

బ్రహ్మోత్సవం ఆడియో & మూవీ రిలీజ్ డేట్స్ ఫిక్స్.

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నచిత్రం బ్రహ్మోత్సవం.

బాలయ్య కోసం అమెరికాలో....

నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ 100 చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

దేనికైనా టైమ్ రావాలి...ఆ  టైమ్ వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది - సంగీత ద‌ర్శ‌కుడు సాయి కార్తీక్

కాల్ సెంట‌ర్ మూవీతో కెరీర్ ప్రారంభించి...అనతి కాలంలోనే యాభై చిత్రాల‌కు సంగీతం అందించిన యువ సంగీత ద‌ర్శ‌కుడు సాయి కార్తీక్. పైసా, ప్ర‌తినిథి, రౌడీ, ప‌టాస్, రాజు గారి గ‌ది...ఇలా విభిన్న క‌థా చిత్రాల‌కు సంగీతం అందించిన‌...సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది అనే ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నాడు.

మే 6న చారుశీల థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

జ్యోత్స్న ఫిలిమ్స్ పతాకంపై దర్శకులు 'సాగర్ ' గారు,కెమెరామెన్ శ్రీనివాసరెడ్డి గారి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'చారుశీల'.

రజనీకాంత్ లా ఎవరినీ చూడలేదంటున్న హీరోయిన్...

వివాదస్పద నటిగా పేరు పొందిన రాధికా అప్టే ఇప్పుడు రజనీకాంత్  సరసన కబాలి చిత్రంలో నటిస్తుంది. రజనీకాంత్ డాన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన భార్య పాత్రలో రాధికా అప్టే కనిపిస్తుందట.