సాయంత్రం ఎస్పీబీ కోసం యూనివర్సల్ మాస్ ప్రేయర్స్ చేద్దాం: ఆర్పీ పట్నాయక్

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. దీంతో దేశం మొత్తం ఆయన ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ట్వీట్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఓ నిర్ణయం తీసుకున్నారు. బాలు ఆరోగ్య పరిస్థితిని కాంక్షిస్తూ మాస్ ప్రేయర్స్ నిర్వహించనున్నట్టు ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తెలిపారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు యూనివర్సల్ మాస్ ప్రేయర్స్ చేద్దామని ఆర్పీ పట్నాయక్ పిలుపునిచ్చారు.

‘‘బాలు గారి ఆరోగ్యం గురించి ప్రేయర్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ చాలా చాలా థాంక్స్. ఈ ప్రేయర్స్ ఇంకా పవర్‌ఫుల్‌గా ఉండాలంటే మనందరం కలిసి ఒకే టైమ్‌లో ఒకేసారి ప్రే చేస్తే దాని పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే ఉద్దేశంతో మేమంతా కలిసి పొద్దున నేడు(ఆగస్ట్ 18) సాయంత్రం 6 గంటలకు యూనివర్సల్ మాస్ ప్రేయర్స్ చేద్దామని అనుకుంటున్నాం. ప్రపంచంలోని బాలుగారి అభిమానులు, శ్రేయోభిలాషులు అంతా కలిసి నేటి సాయంత్రం మాస్ ప్రేయర్ చేద్దాం. మనం ఎక్కడున్నా సరే.. అక్కడి నుంచే బాలు గారు ఆరోగ్యంగా ఉండాలనే మన సంకల్పాన్ని ఆయన వరకూ పంపిద్దాం. మనకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థిద్దాం. అందరం కలిసి ఒకే టైమ్‌లో ఒక పాజిటివ్ ఎనర్జీని పంపిద్దాం. ఆ ఎనర్జీతో ఆయన మరింత ఆరోగ్యంతో మనకు ఆయన పాటలు వినిపించాలని కోరుకుందాం’’ అని ఆర్పీ పట్నాయక్ తెలిపారు.

ఈ యూనివర్సల్ మాస్ ప్రేయర్స్ కారణంగా బాలు కోలకుంటారని.. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని టాలీవుడ్ నమ్ముతోంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ మెసేజ్‌ని షేర్ చేయాలని తెలుగు రాని వారు సైతం తమ తమ భాషల్లో ఈ మెసేజ్‌ను ఆయా భాషల ప్రజానీకానికి తెలియజేయాలని ఆర్పీ పట్నాయక్ కోరారు.