'మాస్ పవర్' చిత్రం ఆడియో విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
శివ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై శివ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం 'మాస్ పవర్'. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రంలో వినాయకుడు పై రూపొందించిన పాటను ఇటీవల ఫిలిం ఛాంబర్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ప్రసన్న కుమార్ అతిథిగా విచ్చేసి పాటను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.."ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమా చేసి విడుదల చేయడమనేది చాలా కష్టమైన పని. అలాంటిది వరుసగా శివ జొన్నలగడ్డ సినిమాలు చేస్తూ విజయం సాధిస్తూ వస్తున్నారు. గతంలో శివ చేసిన 'శనిదేవుడు' చిత్రానికి మేకప్ విభాగంలో నంది అవార్డు వచ్చింది. 'మాస్ పవర్' లో చేసిన వినాయకుడిపై పాట అద్భుతంగా ఉంది. పెద్ద హీరో తరహాలో డాన్స్ చేశాడు శివ. ఏది చేసినా శివ ధైర్యంగా చేస్తాడు. ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే ఇంకా కొంత మంది కొత్తవారు పరిశ్రమకు వస్తారు. ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా" అన్నారు.
దర్శక నిర్మాత శివ జొన్నల గడ్డ మాట్లాడుతూ... "మేము ఇంతకు ముందు ఎన్నో చిత్రాలను రూపొందించాము. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. గణపతిపప్పా మోరియా అంటూ ప్రతి ప్రేక్షకుడు వినేటట్టుగా ఉండాలని, పండుగ ముందురోజు ఈ పాట విడుదల చేశాము. ఈ చిత్రంలో ఐదు ఫైట్లు, రెండు పాటలు ఉన్నాయని తెలిపారు.
నటి సందీప్తి మాట్లాడుతూ..."ఈ చిత్రంలో నేను డాక్టర్ పాత్రలో నటించాను. చాలా సంతృప్తినిచ్చిన పాత్ర. ఇంత మంచి అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు" అన్నారు.
శివ జొన్నల గడ్డ, సందీప్తి, ప్రియ, ప్రియాంక హీరో హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో తక్కల సంజయ్ నాయుడు, వీరవిద్యసాగర్‌మేరు, మామిడాల రామయ్య, బాబూరావు, కల్యాణి, ఫాతిమా, రేవతి, కనకదుర్గ తదితరులు నటిస్తున్నారు.
కెమెరాః కె.శివ; పాటలుః రుద్రంగి రమేష్; డాన్స్ః బండ్ల రామారావు, వరంగల్ శ్యామ్, ఫైట్స్ః సబాస్టంట్స్, రాబిన్ సుబ్బు, శంకర్ ఉయ్యాల, డైమండ్ మధుసూదన్, డైనమిక్ వజ్రాలు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ః చంద్ర, కథ-మాటలు- సంగీతం-స్క్రీన్ ప్లే-దర్శకత్వం-నిర్మాతః శివ జొన్నలగడ్డ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments