'ఖిలాడీ' నుంచి ‘అట్టా సూడకే’ లిరికల్ సాంగ్ రిలీజ్... స్టెప్పులతో అదరగొట్టిన రవితేజ
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఆయన తాజాగా నటిస్తోన్న చిత్రం ‘‘ఖిలాడీ’’. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో రవితేజ సరసన మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రెండు పాటలను కూడా విడుదల చేశారు. తాజాగా ఖిలాడీ నుంచి మూడో పాట ‘అట్టా సూడకే’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను సింగర్ సమీరా భరద్వాజ్‌తో కలిసి దేవీశ్రీ స్వయంగా ఆలపించగా.. శ్రీమణి సాహిత్యం అందించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. 'అట్టా సూడకే.. మత్తెక్కుతాంది ఈడుకే... ఒంట్లో వేడికే పిచ్చెక్కుతాంది నాడికే...' అంటూ సాగే ఈ సాంగ్‌లో రవితేజ, మీనాక్షి చౌదరిలు ఆడిపాడారు.
‘ఖిలాడి’ మూవీ విషయానికొస్తే.. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కీరోల్ ప్లే చేస్తున్నారు. వీర సినిమా తర్వాత రమేశ్ వర్మ - రవితేజ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై అంచనాలు వున్నాయి. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఖిలాడీ కాకుండా రవితేజ చేతిలో నాలుగు సినిమాలు వున్నాయి. ధమాకా, రావణాసుర, రామారావు ఆన్ డ్యూటీతో పాటు టైగర్ నాగేశ్వరరావు చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. ఇందులో రామారావు ఆన్ డ్యూటీ విడుదల తేదీ కూడా ఇప్పటికే ఫిక్స్ అయింది. మార్చి 25న ఈ సినిమా రిలీజ్ కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments