'రామారావు ఆన్ డ్యూటీ' టైం ఫిక్స్ .. ఆర్డర్స్ రిలీజ్ చేసిన మేకర్స్..!!
Send us your feedback to audioarticles@vaarta.com
క్రాక్ హిట్‌తో ట్రాక్‌లోకి వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ వరుస ప్రాజెక్ట్‌లతో దూకుడు మీదున్నారు. రమేశ్ వర్మ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘‘ఖిలాడీ’’ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. దీనిని వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రామారావు: ఆన్ డ్యూటీ’. ఈ చిత్రంలో దివ్యాంకా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. వచ్చే ఏడాది మార్చి 22న ‘‘రామారావు ఆన్ డ్యూటీ’’ని విడుదల చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించారు. ఇక ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వాధికారిగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇక త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘‘థమాకా’’ అనే సినిమా కూడా చేస్తున్నాడు రవితేజ. దీనితో పాటు వంశీ తెరకెక్కిస్తున్న ‘‘టైగర్ నాగేశ్వరరావు’’. యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘‘రావణాసుర’’ అనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మాస్ మహారాజ్. వీటన్నింటిలో ‘‘టైగర్ నాగేశ్వరరావు’’పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం ఓ దొంగ బయోపిక్ అని తెలియగానే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
1970-80 మధ్య కాలంలో టైగర్ నాగేశ్వరరావు అనే గజదొంగ ఉండేవాడు. వరుస దొంగతనాలతో పోలీసులకు, ప్రజలకు నిద్రలేకుండా చేసేవాడు. అయితే, ఆయన చెడ్డ దొంగ కాదని, ఉన్నవాళ్లను దోచుకుని.. పేదలకు సాయం చేసేవాడని స్టువర్ట్‌పురం పరిసర ప్రాంత ప్రజలు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకునేవారు. అందుకే అతడిని ఇండియన్ రాబిన్ హుడ్ లేదా స్టువర్టుపురం రాబిన్ హుడ్ అని పిలిచేవారు. నాగేశ్వరరావు పోలీసుల నుంచి చాలా చాకచక్యంగా తప్పించుకొనేవాడు. దీంతో ఆయన్ని అంతా ‘టైగర్’ అని పిలవడం మొదలుపెట్టారు. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన టైగర్ నాగేశ్వరరావు చివరికి 1987లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఇక ‘‘రావణాసుర’’ చిత్రంలోనూ నెగిటివ్ షేడ్స్ వున్న క్యారెక్టర్ చేయనున్నారట రవితేజ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com