Ravi Teja:ఖరీదైన కారు కొన్న మాస్ మహారాజా రవితేజ.. ధర, ఫీచర్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ.. ఆయన పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో వుండరు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా కృషి, పట్టుదల, అంకిత భావం వుంటే ఎవరైనా స్టార్స్ కావొచ్చని నిరూపించిన వ్యక్తి. మెగాస్టార్ చిరంజీవిని స్పూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవితేజ.. అదే దారిలో స్టార్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. ఈ వయసులోనూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ.. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. గతేడాది కిలాడీ, రామారావ్ ఆన్‌డ్యూటీ, ధమాకా సినిమాలు థియేటర్‌లో దించిన రవితేజ.. సంక్రాంతికి చిరంజీవితో కలిసి వాల్తేర్ వీరయ్యతో సందడి చేశాడు. తాజాగా ఆయన రావణాసురతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం రవితేజ.. టైగర్ నాగేశ్వరరావు, కార్తీక్ ఘట్టమనేని సినిమాల్లో నటిస్తున్నారు.
ఆర్టీఏ కార్యాలయంలో రవితేజ సందడి :
ఇదిలావుండగా రవితేజ కొత్త కారు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం ఆయన హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. దాదాపు రూ.34.5 లక్షలతో కారును కొనుగోలు చేసిన రవితేజకు ఆర్టీఏ అధికారులు టీఎస్09 జీబీ 2628 నెంబర్‌ను కేటాయించారు. ఈ ఫ్యాన్సీ నెంబర్‌ను రూ. 17,628 ఖర్చు చేసి వేలంలో దక్కించుకున్నారు మాస్ మహారాజా. మరోవైపు రవితేజతో ఫోటోలు దిగేందుకు ప్రజలు, ఆర్టీఏ కార్యాలయ సిబ్బంది ఎగబడ్డారు. ఇక ఈ కారు విషయానికి వస్తే.. చైనాలో తయారైన ఈ కారులో అదిరిపోయే ఫీచర్స్ వున్నాయని టాక్. ఇందులో 12.8 అంగుళాల సెంట్రల్ స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్ టెయిల్ గేట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పవర్డ్ ఫ్రంట్ డ్రైవర్, ప్యాసింజర్ సీట్లు తదతర అత్యాధునిక సదుపాయాలు వున్నాయి.
ఇటీవలే 1.9 కోట్లతో లగ్జరీ కారు కొన్న చిరంజీవి :
కాగా.. కొద్దిరోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక లగ్జరీ కారు కొన్నారు. దీని ధర అక్షరాల సుమారు రూ.1.9 కోట్లని సమాచారం. అంతేకాదు.. బ్లాక్ కలర్‌లో రాజసం ఉట్టిపడే ఈ కారుకు ఫ్యాన్సీ నెంబర్ కోసం చిరు అక్షరాల రూ.4.70 లక్షలు ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తోంది. అనంతరం తెలంగాణ రవాణా శాఖ ఆయనకు ‘‘టీఎస్09 జీబీ1111’’ నెంబర్ కేటాయిచింది. ఇందుకోసం మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఈ కారులో ఏడుగురు ప్రయాణీకులు ప్రశాంతంగా కూర్చొని వెళ్లవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments