close
Choose your channels

చెర్రీ కోసం మాస్ డైరెక్టర్ నిరీక్షణ..!

Tuesday, December 31, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చెర్రీ కోసం మాస్ డైరెక్టర్ నిరీక్షణ..!

అల్లూరి సీతారామరాజు .. ఈ పేరు వినగానే కళ్లముందు కదలాడే నటుడు సూపర్ స్టార్ కృష్ణ. వెండితెరపై సీతారామరాజుకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన నటుడిగా చిరస్థాయి నిలిచిపోయే కీర్తి సంపాదించారు. తాజాగా ఈ పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాలో రామరాజుగా చెర్రీ అలరించనున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న చెర్రీ కోసం.. సినీ దర్శకులు వరుస కడుతున్నారు. ఆయనతో సినిమా చేయడానికి .. మంచి పాత్రలను సిద్ధం చేసుకుని నిరీక్షిస్తున్నారు. టాలీవుడ్ తాజా సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ కోసం నిరీక్షిస్తున్నవారిలో వంశీ పైడిపల్లి, క్రిష్ జాగర్లమూడి, హరీశ్ శంకర్ ఉన్నట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా మాస్ సినిమాల దర్శకుడు హరీశ్ శంకర్ .. రామ్ చరణ్ కోసం మంచి కథను సిద్ధం చేశారని.. ఆయనకు వినిపించి డేట్స్ ఫిక్స్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారట. హరీశ్ డైరెక్షన్‌లో రూపొందిన గద్దలకొండ గణేశ్.. ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ ఈ సినిమాతో తనలోని నటుడి సత్తా ఏంటో చూపించాడని సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం చరణ్‌ కోసం ఓ వినూత్న కథాంశంతో రెడీ అయ్యాడని టాక్. చెర్రీని డిఫరెంట్ యాంగిల్ చూపించేలా ప్రాజెక్ట్ సిద్ధం చేశాడట.

రామ్ చరణ్‌ గతంలో చేసిన మాస్ సినిమాలన్నీ కూడా హిట్ అయిన విషయం తెలిసిందే. చిరుత, రచ్చ, నాయక్, ఎవడు మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు హరీశ్‌ సినిమాకు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మాస్ ప్రేక్షకులకు పంచభక్ష్య పరమాన్నమేనన్న టాక్ వినిపిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment