బాల‌య్య కోసం మాస్ బీట్స్‌

  • IndiaGlitz, [Friday,November 17 2017]

'కంచె' సినిమాతో తనలోని ప్ర‌తిభ‌ని చాటిన మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్. న‌ట‌సింహ బాలకృష్ణ 100వ సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాకి కూడా చిరంతన్‌నే సంగీతం అందించాడు. ఆ సినిమాకి చిరంత‌న్ అందించిన బాణీలకు బాలయ్య ఫిదా అయిపోయారు. అందుకే తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ జై సింహా'ని కూడా చిరంతన్ చేతిలో పెట్టాడు.

దానికి త‌గ్గ‌ట్టే బాలయ్య నమ్మకాన్ని వమ్ము చేయలేదనే చెప్తున్నాడీ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే 'జై సింహా' సినిమాకి సంబంధించి బాలయ్య గత చిత్రాల మాదిరిగా.. మంచి మాస్ బీట్స్ ఉన్న ట్రాక్స్ ని, అలాగే రొమాంటిక్ మ్యూజిక్ ని కమర్షియల్ గా కంపోజ్‌ చేసినట్టు చిరంతన్ చెప్పాడు.

డిసెంబర్ నెలాఖరులో ఆడియో లాంచ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీని వచ్చే జనవరి 12న సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌డానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. న‌య‌న‌తార‌, హ‌రిప్రియ ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.