డాక్టర్లూ ఈ వీడియో మీ దగ్గర పెట్టుకోండి.. ఇంత నిర్లక్ష్యమా, వందలాదిమంది ఇలా..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి విడతల వారీగా ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఇప్పటికే మొదటి వేవ్, రెండవ వేవ్ అటూ లక్షలాది ప్రాణాలని బలితీసుకుంది మహమ్మారి. అయినప్పటికీ ప్రజల్లో ఇంకా నిర్లక్ష్యం తగ్గలేదు. కరోనా లాంటి వైరస్ విజృంభిస్తున్నప్పుడు సామజిక దూరం, మాస్కులు ధరించడం ఎంత కీలకమో ఇప్పటికే వైద్యు నిపుణులు సూచించారు.
అయినా ప్రజల్లో చైతన్యం కలగలేదు. సామజిక దూరం లేకుండా వందలాది మంది టూరిస్టులు మనాలిలో ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇటీవల వైరల్ అయింది. తాజాగా ముస్సోరిలో టూరిస్టులు వందలాదిగా వాటర్ ఫాల్స్ కింద మాస్కులు, సామజిక దూరం లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు థర్డ్ వేవ్ పై భయాందోళనలు మొదలయ్యేలా చేస్తున్నాయి.
టూరిస్టుల నిర్లక్ష్య వైఖరికి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముస్సోరిలోని కేంప్టి ఫాల్స్ వద్ద ఈ సంఘటన జరిగింది. చిన్నపిల్లలు, మహిళలు, కొందరు వృద్దులు కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియో పై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. 'మళ్ళీ వీళ్లంతా ప్రభుత్వాలని, డాక్టర్లను బ్లేమ్ చేస్తారు. వెరీ గుడ్ పీపుల్. డాక్టర్లకు నాదో రిక్వస్. ఈ వీడియోని మీ దగ్గర పెట్టుకోండి. మిమ్మల్ని బ్లేమ్ చేసినప్పుడు చూపించండి' అని కామెంట్ చేశాడు.
మరో నెటిజన్..ఇలా అంటున్నందుకు సారీ..మనకు థర్డ్ వేవ్ తప్పదు అని కామెంట్ చేశాడు. ఏప్రిల్, మే నెలల్లో జరిగిన మారణ కాండ అప్పుడే మరచిపోయారా అని విమర్శిస్తున్నారు.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తుండడంతో టూరిజం ప్రదేశాలు కిటకిట మారుతున్నాయి. హోటల్స్ లో కూడా ప్రజలు ఎక్కువవుతున్నారు. ఇలాంటి సమయంలోనే కోవిడ్ నిబంధనల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ప్రజలు బాధ్యతతో మెలగాలి. లేకుంటే ముప్పు తప్పదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments