మస్క్‌ను న్యాయస్థానంలో నిలబెట్టిన భారతీయ విద్యార్థి
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచ కుబేరుడు, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలన్ మస్క్‌ను ఓ భారతీయ అమెరికన్ విద్యార్థి న్యాయస్థానంలో నిలబెట్టగలిగాడు. మస్క్ తనకు పరవు నష్టం కలిగించారని ఆరోపిస్తూ రణదీప్ హోతి అనే భారత సంతతి విద్యార్థి మస్క్ అమెరికాలోని ఓ న్యాయస్థానంలో దావా వేశాడు. ఈ కేసు తాజాగా విచారణకు వచ్చింది. అయితే.. కోర్టులో మస్క్ వాదన మాత్రం వేరేలా ఉంది. హోతి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. తన భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా హోతి వ్యవహరించారని మస్క్ వాదించారు. కానీ న్యాయమూర్తి ఆయన వాదనను తోసిపుచ్చడంతో మస్క్‌కు కోర్టులో కంగుతినక తప్పలేదు.
అసలు విషయంలోకి వెళితే.. బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో భారతీయ అమెరికన్ అయిన రణదీప్ హోతి గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసిస్తున్నారు. కాగా.. విద్యుత్ కార్లపై అధ్యయనం కోసం హోతి 2019 ఫిబ్రవరిలో ఫ్రీమోంట్లోని టెస్లా ఆటో ప్లాంట్‌కు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ప్లాంట్‌లోకి వెళ్లకుండా హోతిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో హోతికి, సెక్యూరిటీ సిబ్బిందికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాగా.. ఆ తర్వాత అదే ఏడాది ఏప్రిల్‌లో హోతి కారులో వెళ్తూ టెస్లా టెస్టు కారు ఫొటోలు తీసి.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ రెండు సంఘటనలు మస్క్‌ను ఆగ్రహానికి కారణమయ్యాయి.
దీంతో హోతిపై మస్క్ ఆన్లైన్ టెక్ ఎడిటర్‌కు ఫిర్యాదు చేశారు. హోతి తన కారులో దూసుకురావడంతో పాటు తమ ఉద్యోగులపై దాడికి పాల్పడ్డాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాకుండా హోతి ఒక అతడు అబద్ధాలకోరని మస్క్ పేర్కొన్నారు. దీంతో మస్క్ తన పరువుకి నష్టం కలిగించారంటూ అమెరికాలోని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అయితే అక్కడ మస్క్‌కి చుక్కెదురైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout