పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో 'మసక్కలి'
Send us your feedback to audioarticles@vaarta.com
సాయిరోనక్, శ్రావ్య, శిరీష వాంక్ హీరో హీరోయిన్లుగా డు గుడ్ ఫాలో రైట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం `మసక్కలి`.నబి ఏనుగుబల(మల్యాల) దర్శకత్వంలో సుమిత్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది.
ఈ సందర్భంగా..
చిత్ర నిర్మాత సుమిత్ సింగ్ మాట్లాడుతూ - ``మసక్కలి చిత్రం ఒక స్వచ్ఛమైన ప్రేమకథ. మా బ్యానర్లో రూపొందుతున్న తొలి చిత్రమిది. దర్శకుడు నబి ఏనుగుబల సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు. ప్రతి సన్నివేశం విజువల్‌గా ఫ్రెష్ ఫీల్‌నిస్తుంది. మిహిరామ్స్ సంగీతం, సుభాష్ దొంతి సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుదిరింది. సాయిరోనక్, శ్రావ్య, శిరీష వాంక్లు తెరపై చూడ చక్కగా ఉంటుంది. సినిమాలో ప్రతి పాత్రకు చాలా ముఖ్యత్వం ఉంటుంది. సినిమాను చూసే ఆడియెన్స్ మంచి అనుభూతికి లోనవుతారు. ఈ నెలలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం`` అని తెలిపారు.
సాయిరోనక్, శ్రావ్య, శిరీష వాంక్, కాశీ విశ్వనాథ్, నవీన్ నేని, చమ్మక్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్ః శివ శర్వాణ, సంగీతంః మిహిరామ్స్, సినిమాటోగ్రఫీః సుభాష్ దొంతి, నిర్మాతః సుమిత్ సింగ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంః నబి ఏనుగుబల(మల్యాల).
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com