Maruti Kiran:రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది.. టికెట్లు అమ్ముకుంటున్నారు: మారుతి కిరణ్

  • IndiaGlitz, [Friday,October 13 2023]

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందని బీజేపీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ బూనేటి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి సరైన క్యాడర్ కూడా లేదన్నారు. టికెట్లు అమ్ముకునే పార్టీ కాంగ్రెస్ అని తీవ్ర ఆరోపణలు చేశారు. టికెట్లు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ నేతలే ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఇక అభ్యర్థులు జాబితా రిలీజ్ చేస్తే ఆ పార్టీలో ఎంత అసంతృప్తి వస్తుందో చూడండన్నారు. అలాంటి పార్టీ గురించి తాము ఏం మాట్లాడటం కూడా అనవసరమని పేర్కొన్నారు. 2018లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి వెళ్లారని.. ఇప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి గెలిచిన కేసీఆర్ దగ్గరకి వెళ్తారని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లేనని ఆయన వివరించారు.

కాంగ్రెస్ పోటీలోనే లేదు.. బీజేపీ-బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ..

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో కనీసం ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదని.. అలాంటి పార్టీ పోటీలో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీతో పాటు దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందన్నారు. మునుగోడు ఎన్నికలో కూడా రాజగోపాల్ రెడ్డి గెలిచేవారని.. కానీ బీఆర్ఎస్ కోట్లు ఖర్చు పెట్టి, ఓటర్లను బెదిరించి గెలిచిందన్నారు. అయినా కానీ రాజగోపాల్ రెడ్డికి పెద్ద ఎత్తును ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల్లో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని మారుతి కిరణ్ స్పష్టం చేశారు.

More News

BRS:జాతీయ పార్టీగా మారిన బీఆర్‌ఎస్‌.. తెలంగాణ సెంటిమెట్‌ను మళ్లీ తెరపైకి తెస్తుందా..?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ఉద్యమ పార్టీగా 2001లో కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) పార్టీ ఏర్పడింది.

Maruti Kiran:సామాన్య కార్యకర్త నుంచి పీఎం స్థాయికి ఎదిగే పార్టీ బీజేపీ మాత్రమే: మారుతి కిరణ్

బీజేపీ అనేది పార్టీ కాదు కుటుంబం అని బీజేపీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ బూనేటి తెలిపారు.

Lokesh:చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది.. ఆయనకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు: లోకేశ్

నెల రోజులుకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Bandla Ganesh:పవన్ కల్యాణ్ సమాజానికి ఉపయోగపడే వ్యక్తి.. ఆయనపై సీఎం జగన్ వ్యాఖ్యలు బాధ కలిగించాయి: బండ్ల గణేష్

జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawankalyan) పెళ్లిళ్లపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(JaganMohan Reddy) చేసిన వ్యక్తిగత విమర్శలు తీవ్ర దుమారం రేపుతున్నాయి

Chandrababu:టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట.. అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. పుంగనూరు అంగళ్లు కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.