మారుతికి కలిసొచ్చిన సెంటిమెంట్
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ రోజుల్లో, బస్‌స్టాప్, కొత్త జంట, భలే భలే మగాడివోయ్ వంటి వరుస విజయాల తరువాత దర్శకుడు మారుతికి బాబు బంగారం రిజల్ట్ చిన్న షాక్ ఇచ్చింది. అయితే ఆ తరువాత వచ్చిన మహానుభావుడుతో మళ్లీ ఆయన సక్సెస్ బాట పట్టారు. సెప్టెంబర్ 29న దసరా కానుకగా విడుదలైన ఈ సినిమాకి తొలి ఆట నుంచే హిట్ టాక్ వచ్చింది. శర్వానంద్, మెహరీన్ ఇందులో జంటగా నటించారు. కాగా, మహానుభావుడు విషయంలో మారుతి సెంటిమెంట్ వర్కవుట్ అయ్యింది.
ఇంతకీ అదేమిటంటే.. 2015లో మారుతి తెరకెక్కించిన భలే భలే మగాడివోయ్ సెప్టెంబర్ నెలలో విడుదలై విజయం సాధించింది. కట్ చేస్తే.. ఆయన తాజా చిత్రం మహానుభావుడు కూడా అదే సెప్టెంబర్‌లో రిలీజై కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధిస్తోంది. అంటే.. మారుతికి సెప్టెంబర్ నెల బాగా కలిసొచ్చినట్టేనన్నమాట. ఇదిలా ఉంటే.. మారుతి తన తదుపరి చిత్రాన్నినాగచైతన్యతో చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com