మారుతి తదుపరి ఆయనతోనేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
రీసెంట్‌గా విడులైన `ప్రతిరోజూ పండగే` చిత్రంతో దర్శకుడు మారుతి సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. కామెడీ పండించడంలో మారుతి దర్శకుడిగా తనదైన మార్కు చూపించాడు. ఇప్పుడు మారుతి తదుపరి సినిమా ఎవరితో చేస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినీ వర్గాల్లో ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య తనయుడు కిరణ్ దాసరిని హీరోగా పెట్టి మారుతి సినిమా చేస్తాడని వార్తలు వినిపించాయి. అయితే మారుతి స్ట్రాటజీ మరో రకంగా ఉందట. ఈ సక్సెస్ వల్ల శర్వానంద్, విజయ్ దేవరకొండ వంటి యువ కథానాయకులు మారుతితో పనిచేయడానికి ఆసక్తిగానే ఉన్నారట. మారుతి వాళ్లతో కథను ఓకే చేయించుకుని దాన్ని దానయ్య బ్యానర్‌లోనే చేయాలనుకుంటున్నాడట.
దానయ్య కొడుకుని హీరోగా వెంటనే చేసేసి మారుతికి ఏదో చేసేయాలనైతేలేదు. కాస్త టైమ్ అటూ ఇటూ అయినా మరో స్టార్ హీరోతో వెళ్లి మరో హిట్ కొడితేనే దర్శకుడిగా రేంజ్ పెరుగుతుందని మారుతి యోచనగా కనపడుతుందట. ఒకవేళ ఎవరైనా స్టార్ హీరో సినిమాను ఓకే చేసి సమయం తీసుకుంటే..ఆ గ్యాప్‌లో దానయ్య తనయుడితో సినిమా చేసేయాలని కూడా అనుకుంటున్నట్లు టాక్. మరి ఈ వార్తలకు చెక్ పెడుతూ మారుతి తన తదుపరి ప్రాజెక్ట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తాడో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com