మారుతి, నాగచైతన్య చిత్రం అప్‌డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
నాగ చైతన్య కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు' (ప్రచారంలో ఉన్న పేరు) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించనుంది. కాగా, ఈ నెల 19వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించనున్నారు. అలాగే 20 రోజుల పాటు నిరవధికంగా షూటింగ్ కొనసాగనుందని సమాచారం.
హీరో హీరోయిన్స్ 'ఈగో' సమస్యల నేపథ్యంలో.. వినోదభరితంగా ఈ సినిమా ఉంటుందని తెలిసింది. గతంలో "మతిమరుపు", "అతిశుభ్రత" వంటి సమస్యలతో బాధపడుతున్న పాత్రలని హీరో పాత్రలుగా మలచి.. మారుతి వినోదాన్ని పండించిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు గోపీ సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. 'భలే భలే మగాడివోయ్' చిత్రం తరువాత మారుతి, గోపీ సుందర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. 'మహానుభావుడు' తరువాత మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments