మే నెలలో మారుతి, చైతన్య మూవీ ఫస్ట్‌లుక్
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం 'శైలజా రెడ్డి అల్లుడు' (ప్రచారంలో ఉన్న పేరు). దాసరి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ నటి రమ్యకృష్ణ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. తాజాగా మొదటి షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుందీ చిత్రం.
ప్రస్తుతం చైతు 'సవ్యసాచి' చిత్రీకరణలో బిజీగా ఉండడం వలన ఈ సినిమా చిత్రీకరణలో కొంత జాప్యం జరుగుతోంది. చైతు 'సవ్యసాచి' పూర్తి చేసుకుని వచ్చిన వెంటనే.. మళ్ళీ షూటింగ్ ప్రారంభం అవుతుందని.. తాను కూడా అందరిలాగే ఎదురు చూస్తున్నానని దర్శకుడు మారుతి ట్విట్టర్ ద్వారా వివరించారు.
దీంతో పాటు ఫస్ట్‌లుక్ విడుదల గురించి కూడా అభిమానులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. మే నెలలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.
వెన్నెల కిషోర్, రఘుబాబు, కళ్యాణి నటరాజన్ ముఖ్య పాత్రలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com