మే నెల‌లో మారుతి, చైత‌న్య మూవీ ఫ‌స్ట్‌లుక్‌

  • IndiaGlitz, [Sunday,March 25 2018]

అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం 'శైలజా రెడ్డి అల్లుడు' (ప్ర‌చారంలో ఉన్న పేరు). దాసరి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ నటి రమ్యకృష్ణ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. తాజాగా మొదటి షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుందీ చిత్రం.

ప్రస్తుతం చైతు 'సవ్యసాచి' చిత్రీకరణలో బిజీగా ఉండడం వలన ఈ సినిమా చిత్రీకరణలో కొంత జాప్యం జరుగుతోంది.  చైతు 'సవ్యసాచి' పూర్తి చేసుకుని వచ్చిన వెంటనే.. మళ్ళీ షూటింగ్ ప్రారంభం అవుతుందని.. తాను కూడా అందరిలాగే ఎదురు చూస్తున్నాన‌ని దర్శకుడు మారుతి ట్విట్టర్ ద్వారా వివరించారు.

దీంతో పాటు ఫస్ట్‌లుక్ విడుదల గురించి కూడా అభిమానులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. మే నెలలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.

వెన్నెల కిషోర్‌, రఘుబాబు, కళ్యాణి నటరాజన్‌ ముఖ్య పాత్రలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కానుంది.

More News

ఆది, అడివి సాయికిరణ్ సినిమా అప్‌డేట్‌

'ప్రేమకావాలి', 'లవ్లీ' సినిమాలతో వ‌రుస విజయాలను సొంతం చేసుకున్న యువ క‌థానాయ‌కుడు ఆది. గత కొంత కాలంగా విజయాలకు దూరమైన ఈ యంగ్ హీరో..

చిరు సినిమా పై స్పందించిన సుకుమార్‌

గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందంటూ గ‌త కొంత కాలంగా మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.

విశాఖపట్నంలో వైభవంగా 'కిరాక్ పార్టీ' సక్సెస్ సెలబ్రేషన్స్ !!

నిఖిల్, సిమ్రాన్, సంయుక్త హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'కిరాక్ పార్టీ'. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు.

'నీది నాది ఒకే కథ' లాంటి గొప్ప చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన దర్శక నిర్మాతలకు హ్యాట్సాఫ్‌ - ప్రముఖ దర్శకులు

'అప్పట్లో ఒకడుండేవాడు'లాంటి డిఫరెంట్‌ చిత్రాన్ని నిర్మించిన ఆరాన్‌ మీడియా వర్క్స్‌ సంస్థ లేటెస్ట్‌గా 'నీది నాది ఒకే కథ' వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు.

మహేష్‌ 'భరత్‌ అనే నేను' మొదటి పాట విడుదల

మహేష్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్‌ అనే నేను'.