నిర్మాతకు 50 లక్షలు మిగిల్చిన మారుతి...
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకుడు మారుతి.. మరోవైపు తన స్వంత బ్యానర్‌లో సినిమాలు కూడా చేస్తుంటారనే సంగతి తెలిసిందే. అంటే దర్శకుడు మారుతిలో నిర్మాత కూడా ఉన్నారు కాబట్టే.. ఆయన ప్రాజెక్ట్ టేకింగ్ ఓ ప్రణాళిక ప్రకారం జరుగుతుందని భావిస్తుంటారు అందరూ. రీసెంట్‌గా మారుతి డైరెక్ట్ చేస్తున్న చిత్రం `శైలజారెడ్డి అల్లుడు` సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీకి యాబై లక్షలు మిగిల్చారని టాక్ వినపడుతుంది.
అదెలాగంటే.. ఈ సినిమాలో అత్త పాత్రలో నటించిన రమ్యకృష్ణకు ముందుగా 28 రోజుల కాల్షీట్స్ అనుకున్నారు. రమ్యకృష్ణకు రోజుకు ఆరు లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మారుతి తన ప్రణాళికతో రమ్యకృష్ణ రోల్‌ను 22రోజుల్లోనే పూర్తి చేసేశాడట. ఆ లెక్కలో 36లక్షల రెమ్యునరేషన్.. ఇతరత్రా ఖర్చులు మొత్తం కలిపి 50 లక్షలు మిగిల్చాడని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com