ప్రేమ అలా కాకూడదనే రోజులు మారాయి తీసాం - మారుతి
Wednesday, June 29, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
దిల్ రాజు సమర్పణలో మారుతి కథ - స్ర్కీన్ ప్లేతో రూపొందిన చిత్రం రోజులు మారాయి. ఈ చిత్రాన్ని మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో జి.శ్రీనివాసరావు నిర్మించారు. విభిన్నమైన కథాంశంతో రూపొందిన రోజులు మారాయి చిత్రాన్ని జులై 1న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ...ఇటీవల పేపరులో అబ్బాయిని అమ్మాయిలు కలిసి చంపేశారని చదివాను. ఆ ఆర్టికల్ చదువుతున్నప్పుడు వచ్చిన ఆలోచనకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి మా డైరెక్టర్, రైటర్ కథను డెవలప్ చేసారు. నలుగురి మధ్య జరిగే డ్రామానే ఈ సినిమా.
ఈ చిత్రంలో ఒక జంటగా పార్వతీశం, తేజస్విని తీసుకోవాలి అనుకున్నాం. అయితే వారిద్దరి డేట్స్ దిల్ రాజు గారి దగ్గర ఉన్నాయని తెలిసి కలిస్తే...కథ నచ్చి దిల్ రాజు గారు మాతో అసోసియేట్ అయ్యారు. ఈ మధ్య ప్రేమను బట్టలు సెలెక్ట్ చేసుకున్నట్టుగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ప్రేమ అలా కాకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ చిత్రం తీసాం. నేను బాబు..బంగారం బిజీలో ఉండడం వలన ఈ సినిమా షూటింగ్ టైమ్ లో సెట్స్ కి అసలు వెళ్లలేదు. సినిమా పూర్తయిన తర్వాత చూసి నేను అనుకున్నట్టుగానే తీసారనిపించింది. నేను డైరెక్ట్ చేయడానికి చాలా కథలు ఉన్నాయి. నా టీమ్ ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశ్యంతోనే అవకాశాలు ఇస్తున్నాను అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments