శర్వానంద్ కి కూడా అదే ఫార్ములా..

  • IndiaGlitz, [Wednesday,August 23 2017]

యూత్‌ని ఎట్రాక్ట్ చేసే సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్నాడు మారుతి. ఈరోజుల్లో, బ‌స్‌స్టాప్‌, కొత్త జంట‌, భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రాల‌తో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న మారుతికి.. అత‌ని గ‌త చిత్రం బాబు బంగారం ఆశించిన విజ‌యం అందించ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్‌తో మ‌హానుభావుడు అనే సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు మారుతి.

అంతేకాకుండా త‌న కెరీర్‌లోనే పెద్ద హిట్ అయిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్ ని రెండు విష‌యాల్లో ఫాలో అవుతూ మ‌హానుభావుడుని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకున్నాడు స‌ద‌రు డైరెక్ట‌ర్‌. ఇంత‌కీ ఆ విష‌యాలేంటంటే.. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాలో హీరోయిన్‌గా ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ పూడి ప‌రిచ‌యం చేసిన లావ‌ణ్య త్రిపాఠిని తీసుకున్న మారుతి.. మ‌హానుభావుడు కోసం కూడా అదే హ‌ను రాఘ‌వ‌పూడి ప‌రిచ‌యం చేసిన మెహ్రీన్‌ని హీరోయిన్‌గా ఎంచుకున్నాడు.

అంతేకాదు.. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ విడుద‌లైన సెప్టెంబ‌ర్‌లోనే మ‌హానుభావుడు కూడా విడుద‌ల కాబోతోంది. యాదృచ్ఛికంగా జ‌రిగినా.. ఈ రెండు విష‌యాలు మ‌హానుభావుడుకి కూడా వ‌ర్క‌వుట్ అవుతాయామో చూడాలి. మ‌హానుభావుడు సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల కానుంది.

More News

నాని హీరోయిన్ సినిమాలు క్యూ కడుతున్నాయి

కృష్ణగాడి వీరప్రేమగాథ.. ఈ సినిమా విడుదలై ఒకటిన్నర సంవత్సరం అయింది. ఈ గ్యాప్ లో ఆ చిత్ర కథానాయకుడు నాని ఇప్పటికే నాలుగు సినిమాలతో సందడి చేశాడు. అయితే ఆ సినిమా హీరోయిన్ మెహ్రీన్ మాత్రం ఇప్పటి వరకు వెండితెరపై దర్శనమివ్వనేలేదు. అలాగని ఖాళీగా ఉందా అంటే.. ఐదు సినిమాలతో బిజీగా ఉంది. వీటిలో నాలుగు తెలుగు సినిమాలు..ఒక తమిళ సినిమా ఉంది.

సెప్టెంబర్ 2న 'వెళ్ళిపోమాకే' చిత్రాన్ని విడుదల చేయనున్న దిల్ రాజు

నూతన చిత్రాలకు,నటీనటులకు,టెక్నిషియన్స్ కు అండగా నిలబడే హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మరోసారి ఒక యంగ్ టీం కు సపోర్ట్ చేయబోతున్నాడు.యాకూబ్ అలీ దర్శకత్వంలో రూపొందిన ,వెళ్ళిపోమాకే'చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేస్తున్నారు.

'జై లవకుశ' ఆడియో డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'జైలవకుశ'.

ఇక్కడ తారక్.. అక్కడ విజయ్..

ఎన్టీఆర్ తన కెరీర్ లోనే తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం జైలవకుశ.

పవన్ కి నాట్ ఓకే..మరి చిరుకి?

డబుల్ ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ తెలుగులో పరిమిత సంఖ్యలోనే సినిమాలు చేశాడు.