శర్వానంద్ కి కూడా అదే ఫార్ములా..
Send us your feedback to audioarticles@vaarta.com
యూత్‌ని ఎట్రాక్ట్ చేసే సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్నాడు మారుతి. ఈరోజుల్లో, బస్‌స్టాప్, కొత్త జంట, భలే భలే మగాడివోయ్ చిత్రాలతో సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మారుతికి.. అతని గత చిత్రం బాబు బంగారం ఆశించిన విజయం అందించలేకపోయింది. ప్రస్తుతం శర్వానంద్‌తో మహానుభావుడు అనే సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు మారుతి.
అంతేకాకుండా తన కెరీర్లోనే పెద్ద హిట్ అయిన భలే భలే మగాడివోయ్ ని రెండు విషయాల్లో ఫాలో అవుతూ మహానుభావుడుని ప్రేక్షకుల ముందుకు తీసుకున్నాడు సదరు డైరెక్టర్. ఇంతకీ ఆ విషయాలేంటంటే.. భలే భలే మగాడివోయ్ సినిమాలో హీరోయిన్గా దర్శకుడు హను రాఘవ పూడి పరిచయం చేసిన లావణ్య త్రిపాఠిని తీసుకున్న మారుతి.. మహానుభావుడు కోసం కూడా అదే హను రాఘవపూడి పరిచయం చేసిన మెహ్రీన్‌ని హీరోయిన్గా ఎంచుకున్నాడు.
అంతేకాదు.. భలే భలే మగాడివోయ్ విడుదలైన సెప్టెంబర్‌లోనే మహానుభావుడు కూడా విడుదల కాబోతోంది. యాదృచ్ఛికంగా జరిగినా.. ఈ రెండు విషయాలు మహానుభావుడుకి కూడా వర్కవుట్ అవుతాయామో చూడాలి. మహానుభావుడు సెప్టెంబర్ 29న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com