సెంటిమెంట్ ఫాలో అవుతున్న మారుతి...

  • IndiaGlitz, [Friday,December 11 2015]

ఈరోజుల్లో...అనే చిన్న సినిమాతో పెద్ద విజ‌యాన్ని సాధించి ఇండ‌స్ట్రీ ద్రుష్టిని త‌న వైపుకి తిప్పుకున్న యూత్ ఫుల్ డైరెక్ట‌ర్ మారుతి. ఆత‌ర్వాత బ‌స్టాఫ్‌, ప్రేమ‌క‌థా చిత్ర‌మ్...తో సెన్సేష‌న్ క్రియేట్ చేసాడు. ఆత‌ర్వాత మారుతి చేసిన సినిమాలు ఆశించిన స‌క్సెస్ అందించ‌క‌పోయినా...మ‌ళ్లీ నానితో తీసిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాతో సెన్సేష‌న‌ల్ హిట్ సాధించాడు. దీంతో బి అనే ఇంగ్లీషు అక్ష‌రం మారుతికి సెంటిమెంట్గా మారింద‌ట‌. అందుక‌నే వెంక‌టేష్ తో చేసే త‌న త‌దుప‌రి చిత్రానికి బాబు బంగారం అనే టైటిల్ ఫిక్స్ చేసాడ‌ట‌. ఈ నెల‌లోనే వెంకీతో మారుతి సినిమా ప్రారంభించ‌నున్నారు. మ‌రి...మారుతి సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుందా..? బాబు బంగారం విజ‌యం సాధిస్తుందా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

విష్ణు హీరోయిన్ మారిపోయింది...

మంచు విష్ణు హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

చండియాగంలో చరణ్ దంపతులు...

తన నెక్ట్స్ సినిమాకు గ్యాప్ దొరకడంతో విదేశాలకు వెళ్ళిన చరణ్ అక్కడ నుండి కూడా వచ్చేశాడు.

బాలయ్యతో ఆ హీరోయిన్..?

ఇప్పుడు ఓ లేటెస్ట్ న్యూస్ ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తుంది.అదే నందమూరి బాలకృష్ణ సరసన తమిళ హీరోయిన్ నయనతార నటించనుందని.

ఈ ఇయర్ బెస్ట్ ఆల్బమ్ సన్నాఫ్ సత్యమూర్తి

ప్రతి సంవత్సరం యాపిల్ సంస్థ టాలీవుడ్ బెస్ట్ ఆల్బమ్ ను ప్రకటిస్తుంటుంది.అలాగే ఈ సంవత్సరం కూడా యాపిల్ ఐ ట్యూన్స్ బెస్ట్ ఆల్బమ్ ని ఎనౌన్స్ చేసింది.

ఈ ఇయర్ ఫేస్ బుక్ హీరో..

ఫేస్ బుక్...చూస్తే చాలు...ఎక్కువుగా ప్రజలు దేని గురించి మాట్లాడుకుంటున్నారో...ఇట్టే తెలిసిపోతుంది.అది రాజకీయం కావచ్చు..