ప్రివ్యూ చూసి మెగాస్టార్ మెచ్చుకున్నారు: డైరెక్టర్ మారుతీ
Send us your feedback to audioarticles@vaarta.com
సుప్రీమ్ హీరో సాయి తేజ్, రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా హ్యాట్రిక్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జిఎ2 పిక్చర్స్, యువి క్రియేషన్స్ బేనర్స్‌పై యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ నిర్మాతగా రూపొందిన చిత్రం 'ప్రతిరోజూ పండగే'. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకొని, మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా హ్యాట్రిక్ డైరెక్టర్ మారుతి మీడియాతో ముచ్చటించారు.
'ప్రతిరోజూ పండగే' చిత్రానికి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?
ఈ కథ మీద నమ్మకం ఉండటంతో బిగినింగ్ నుండి ఎప్పుడూ టెన్షన్ పడలేదు. ఈ థాట్ గురించి ఎవరికి చెప్పినా బాగుంది, బాగుంది అన్నారు. 65 రోజుల్లో సినిమాని పూర్తి చేశాం. రిలీజ్‌కి ముందు నుంచి కూడా హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న సినిమాల్ని మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ వస్తున్నారు. ఈ ట్రెండ్‌లో ఈ కథ బాగుంటుందని ముందు నుండి అనుకున్నాం. అలాగే నిన్న సినిమా రిలీజ్ అయింది. థియేటర్స్‌లో ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారనేది అందరం చూస్తున్నాం. ఒక మంచి ఎమోషన్ కూడా చెప్పదలుచుకున్నాం. కాకపోతే నా కామెడీ టైమింగ్ ఆ ఎమోషన్‌ని డామినేట్ చేసింది. అయితే మన తల్లిదండ్రుల్ని మనం ఎంతవరకు చూసుకుంటున్నాం అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికీ కలిగింది. ఆ విషయంలో నేను చాలా సంతోషంలో ఉన్నాను.
ఇండస్ట్రీ నుండి ఎలాంటి అప్రిషియేషన్ వచ్చింది?
చిరంజీవిగారు ప్రివ్యూ చూడగానే 'చాలా హెల్దీగా తీశావ్. చాలా నీట్‌గా సందేశం వెళ్లింది. ఎంత కలెక్ట్ చేస్తుందో చెప్పలేను కానీ.. మంచి సినిమా. మీ టీమ్ అందరికీ గుర్తుండిపోయే సినిమా' అన్నారు. అలాగే రాఘవేంద్రరావుగారు ఫోన్ చేసి 'చాలా రిస్కీ పాయింట్. అలాంటి పాయింట్‌ను చాలా ఎంటర్‌టైన్ చేస్తూ చెప్పావ్' అని అప్రిషియేట్ చేశారు. అలాగే దిల్ రాజు, శిరీష్, శివ నిర్వాణ, పరశురామ్, బుజ్జి.. ఇలా చాలామంది దర్శకులు, నటులు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. 'భలే భలే మగాడివోయ్' తర్వాత నాకు అన్ని కాల్స్, మెసేజ్‌లు వచ్చిన సినిమా ఇది. ఇంతకుముందు మారుతి కామెడీ మాత్రమే బాగా చేస్తాడు అనుకునేవారు.. ఈ సినిమాతో ఎమోషన్‌ని కూడా బాగా హ్యాండిల్ చేయగలడు అని మరోసారి ప్రూవ్ అయింది.
రావు రమేష్ క్యారెక్టర్‌ను స్పెషల్‌గా డిజైన్ చేశారు కదా? ఎవరైనా ఇన్‌స్పిరేషన్ ఉన్నారా?
ఈ కథ అనుకున్నప్పుడే హీరో తండ్రి క్యారెక్టర్ రావు రమేష్‌గారు అని డిసైడ్ అయ్యాం. నేను వెళ్ళి ఆయనకు కథ చెప్పగానే 'చాలా బాగుంది. తప్పకుండా చేస్తాను' అన్నారు. సినిమాలో కీలకమైన పాత్ర కావడంతో 28 రోజులు షూట్ చేశాం. ఆయనతో షూటింగ్ చేస్తున్నప్పుడు మాకు ప్రతిరోజూ పండగ లాగే అన్పించింది. బిజీగా ఉండి ఎంతమంది పేరెంట్స్ విషయంలో కేర్ తీసుకుంటున్నారు అనుకునేదానికి రెండు, మూడు ఇన్సిడెంట్స్ చూశాను. కొంతమంది అయితే వెంటిలేటర్ మీద పెట్టి పోయే ముందు చెప్పండి వస్తాం అనేవారు కూడా ఉన్నారు. ఇలాంటివన్నీ చూసి, వినీ నిజంగా తల్లిదండ్రులు చివరిదశలో ఉన్నప్పుడు అన్నీ పక్కన పెట్టి, ఫ్యామిలీ అంతా కలిసి చూసుకోవడమే ధర్మం అని చెప్పదలుచుకున్నాను.
ఈ కథ మొదట దిల్‌రాజుగారికి చెప్పారు కదా?
నాకు ఈ థాట్ రాగానే ఇలాంటి కథ దిల్‌రాజుగారి బేనర్‌లో చేస్తే బాగుంటుంది అనుకొని ఆయనకి కథ చెప్పడం జరిగింది. ఆయన ఇప్పటికే ఇలాంటి ఫ్యామిలీ, ఎమోషన్స్ ఉన్న సినిమాలు తీసి ఉండటంతో రెగ్యులర్ అవుతుందని జిఎ2, యువి క్రియేషన్స్‌లో చేశాం.
వెబ్ సిరీస్ చేసే అవకాశం ఉందా?
మన ఫ్యూచర్ వెబ్ సిరీసే అని నమ్ముతాను. క్వాలిటీతో తీస్తే రాను రాను థియేటర్ ఆడియన్స్ తగ్గే అవకాశం ఉంది. పెద్ద దర్శకులు కూడా మంచి కంటెంట్‌ని సినిమా రేంజ్‌లో ఇవ్వగలిగితే వెబ్ సిరీస్ చాలా బాగుంటాయి. హిందీలో అనురాగ్ కశ్యప్‌లాంటి దర్శకులు మంచి సిరీస్‌లను తెరకెక్కిస్తున్నారు. నన్ను కూడా నెట్‌ఫ్లిక్స్‌లో లస్ట్ స్టోరీస్‌కి దర్శకత్వం చేయమని అడిగారు. నేను బిజీగా ఉండటం వల్ల కుదరలేదు.
మీకెలాంటి చిత్రాలంటే ఇష్టం?
స్టార్ హీరోల కన్నా ప్రేక్షకుల హృదయాల్ని కదిలించే సినిమాలు తీయడానికే ఇష్టపడతాను. కథకి ఎవరైతే యాప్ట్ అవుతారో వారినే అప్రోచ్ అవుతాను. త్వరలో ఒక ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనింగ్ ఉండే ప్రేమకథ చేయబోతున్నాను.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు హ్యాట్రిక్ డైరెక్టర్ మారుతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com