పెళ్లైంది కానీ రాహుల్‌తో డేటింగ్ కావాలట...
Send us your feedback to audioarticles@vaarta.com
ఆమె బాలీవుడ్లో స్టార్ హీరోయిన్.. ఓ స్టార్‌ను పెళ్లి చేసుకుంది. అయితే రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీతో డేటింగ్‌కి వెళ్లాలనుందని చెప్పి హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకెళ్తే.. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. కరీనాకపూర్. సైఫ్ ఆలీఖాన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి తైమూర్ అనే కొడుకు కూడా ఉన్నాడు. అయితే రీసెంట్గా ఓ ఇంటర్య్యూలో యాంకర్ కరీనాతో మాట్లాడుతూ మీకు ఎవరితోనైనా డేటింగ్‌కు వెళ్లాలనుకుంటే ఎవరితో వెళతారు అని ప్రశించగా ఇప్పుడు ఆ పేరు చెప్పాలో లేదో తెలియదు కానీ.. చెబుతానంటూ రాహుల్ గాంధీ పేరు చెప్పింది కరీనా. ఇప్పుడు ఈ సమాధానం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments