మరో దృశ్యం ఆడియో విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
కట్ల రాజేంద్ర ప్రసాద్, అవంతిక, గౌతమ్ , కోలా మధు సిందూర ముఖ్య పాత్రల్లో కట్ట రాజేంద్ర ప్రసాద్ దర్శకతంలో గంగోత్రి ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకం పై శ్రీపతి గంగాదాస్ నిర్మిస్తున్న మరో దృశ్యం చిత్రంలోని పాటలు ఆదివారం ఫిలిం ఛాంబర్ లో విడుదల అయ్యాయి. మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా సిడి ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అశోక్ రెడ్డి, దేవా శేఖర్ గౌడ్, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా శివాజీ రాజా మాట్లాడుతూ .. రాజేంద్ర ప్రసాద్ నాకు చాలా కాలంగా మంచి మిత్రుడు. స్నేహానికి విలువ ఇచ్చే మనిషి .. ఈ సినిమా గురించి నాకు తెలుసు, మంచి కథ ఉంటె తప్పకుండ ప్రేక్షకులు ఆదరిస్తారని చాలా సినిమాలు నిరూపించాయి. అదే తరహాలో ఈ మరో దృశ్యం సినిమా మంచి విజయం అందుకోవాలని, వెంకటేష్ బాబు నాటించిన దృశ్యం సినిమాల నిలవాలని అన్నారు.
నిర్మాత అశోక్ రెడ్డి మాట్లాడుతూ .. నా మిత్రుడు ఆర్పీ తీస్తున్న ఈ సినిమా తప్పకుండా మంచి విజయం అందుకోవాలి. ఇండియన్ స్క్రీన్ పై ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా రాలేదు అన్నారు.
దర్శకుడు - హీరో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ .. దర్శకుడిగా ఇది నా ఆరవ సినిమా. హీరోగా ఇది నాలుగో సినిమా. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశాను. ఈ సినిమా ద్వారా మా అబ్బాయి గౌతమ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ కథను మూడేళ్లు రీసెర్చ్ చేసి సినిమా తీసాను. సెన్సార్ సభ్యులు కూడా మెచ్చుకున్నారు. ప్రస్తుతం సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందే అని చెప్పే ప్రయత్నమే ఇది.
పోలీస్ డిపార్ట్మెంట్ కు కూడా నచ్చే సినిమా. ఈ సినిమా కోసం చాలా కష్టాలు పడ్డాము. ముప్పై మంది నిర్మాతలు మారారు .. చివరగా గంగాదాస్ నాకోసం నేనున్నా అంటూ ఆగిపోయిన ఈ సినిమా మళ్ళీ మొదలయ్యేలా చేసాడు. తాను నాకోసం ఏంతో చేస్తున్నాడు అతని ఋణం తీర్చుకోలేనిది. మాలాంటి చిన్న చిత్రాలను , చిన్న నిర్మాతలు ప్రోత్సహించాలి. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు ముగిసాయి .. ఈ నెల 15న విడుదల చేస్తున్నాం అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం : ప్రమోద్ కుమార్, కెమెరా : భాస్కర్ల మురళి, ఎడిటింగ్ : వెంకటేశ్వర్లు , ఫైట్స్ : నాభ, రాబిన్, సుబ్బు, నిర్మాణం : శ్రీపతి గంగాదాస్ , కథ, స్క్రీన్ ప్లే, మాటలు , డాన్స్, దర్శకత్వం - కట్ల రాజేంద్ర ప్రసాద్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout