'డిజె - దువ్వాడ జగన్నాథం' సెట్ లో 'మర్లపులి' ట్రైలర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
అర్చనవేద ప్రధాన పాత్రదారిగా వరుణ్‌సందేశ్ ప్రత్యేకపాత్రలో నటించిన చిత్రం 'మర్లపులి'. ఎపిక్ పిక్చర్స్ మరియు బోర్న్క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి డి. రామకృష్ణ దర్శకుడు. బి. ప్రదీప్‌రెడ్డి, బి. భవానీ శంకర్, బి. శ్రీనివాస్‌రెడ్డి, శరత్ నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్‌ని స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ హీరోగా తెరకెక్కుతున్న 'డిజె-దువ్వాడ జగన్నాథం' సెట్లో నిర్మాత దిల్‌రాజు, డైరెక్టర్ హరీష్‌శంకర్, మరో డైరెక్టర్ వంశీ పైడిపల్లి లు విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు డి. రామకృష్ణ మాట్లాడుతూ.. మా చిత్ర ట్రైలర్‌ని విడుదల చేసిన నిర్మాత దిల్‌రాజు గారికి, డైరెక్టర్స్ హరీష్‌శంకర్ మరియు వంశీ పైడిపల్లిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నిర్మాతలు ఈ చిత్రం కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సహకరించారు. చిత్రం బాగా వచ్చింది. అర్చనవేద నటన ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. వరుణ్‌సందేశ్ చాలా కీలకమైన పాత్రలో నటించారు. 'మర్లపులి' మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాము..అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. అడగగానే మా చిత్ర ట్రైలర్‌ని ఆవిష్కరించడానికి అంగీకరించిన దర్శకులు వంశీపైడిపల్లి గారికి, హరీష్ శంకర్ గారికి, నిర్మాత దిల్ రాజు గారికి మా చిత్ర యూనిట్ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ట్రైలర్ చూసిన తర్వాత చాలా బాగుంది. మంచి విజయం కావాలని వారు అనడం మా చిత్రానికి మంచి ఆశీస్సులుగా భావిస్తున్నాము. అలాగే దర్శకుడు రామకృష్ణ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అతి త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి, మంచి సక్సెస్ చేస్తారని భావిస్తున్నాము..అని అన్నారు.
అర్చన ప్రధాన పాత్రలో, వరుణ్ సందేశ్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళీ, భానుశ్రీ, తాగుబోతు రమేష్, రమణారెడ్డి మొదలగు వారు ఇతర పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి కెమెరా: మురళీకృష్ణ, సంగీతం: బి.ఎస్.రెడ్డి, నిర్మాతలు: బి. ప్రదీప్‌రెడ్డి, బి. భవానీ శంకర్, బి. శ్రీనివాస్‌రెడ్డి, శరత్, రచన-దర్శకత్వం: డి. రామకృష్ణ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com