దసరా కానుకగా 'మరియన్'
Send us your feedback to audioarticles@vaarta.com
ధనుష్ హీరోగా, పార్వతీ మీనన్ హీరోయిన్గా భరత్‌బాల దర్శకత్వంలో ఆస్కార్ ఫిలింస్ ప్రై. లి. పతాకంపై ప్రముఖ నిర్మాత ఆస్కార్ వి. రవిచంద్రన్ తమిళంలో నిర్మించిన మరియన్` చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎస్.వి.ఆర్. మీడియా ప్రై. లిమిటెడ్ నిర్మాత సి.జె. శోభ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న సి.జె.శోభ ఇప్పుడు మరో విభిన్న చిత్రం మరియన్`ను తెలుగులో అందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని విజయదశమి కానుకగా అక్టోబర్ 22న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా..
నిర్మాత సి.జె.శోభ మాట్లాడుతూ మా ఎస్వీఆర్ మీడియా బ్యానర్లో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలరె తెలుగు ప్రేక్షకులకు అందించాం. ఇప్పుడు మరియన్` చిత్రంతో ప్రేక్షల ముందుకు వస్తున్నాం. విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 22న విడుదల చేస్తున్నాం. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ అందించిన సంగీతం స్పెషల్ హైలైట్ అని చెప్పాలి. ఎప్పుడూ డిఫరెంట్ సినిమాలను చేస్తూ మంచి పేరు తెచ్చుకునే ధనుష్ తన కెరీర్లో ఇప్పటివరకు చేయని ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఈ సినిమాలో చేశారు. ఒక యదార్థ సంఘటన ఆధారంగా భరత్‌బాల రూపొందించిన ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. తమిళ్లో ఆస్కార్ రవిచంద్రన్‌గారు నిర్మించిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని సాధించింది. తెలుగు ప్రేక్షలకు కూడా ఆదరిస్తారన్న నమ్మకంతో ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్ 22న విడుదల చేస్తున్నాం`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments