దసరా కానుకగా 'మరియన్'

  • IndiaGlitz, [Saturday,October 17 2015]

ధనుష్‌ హీరోగా, పార్వతీ మీనన్‌ హీరోయిన్‌గా భరత్‌బాల దర్శకత్వంలో ఆస్కార్‌ ఫిలింస్‌ ప్రై. లి. పతాకంపై ప్రముఖ నిర్మాత ఆస్కార్‌ వి. రవిచంద్రన్‌ తమిళంలో నిర్మించిన మరియన్‌' చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎస్‌.వి.ఆర్‌. మీడియా ప్రై. లిమిటెడ్‌ నిర్మాత సి.జె. శోభ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగా పేరు తెచ్చుకున్న సి.జె.శోభ ఇప్పుడు మరో విభిన్న చిత్రం మరియన్‌'ను తెలుగులో అందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని విజయదశమి కానుకగా అక్టోబర్‌ 22న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా..

నిర్మాత సి.జె.శోభ మాట్లాడుతూ మా ఎస్వీఆర్‌ మీడియా బ్యానర్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలరె తెలుగు ప్రేక్షకులకు అందించాం. ఇప్పుడు మరియన్‌' చిత్రంతో ప్రేక్షల ముందుకు వస్తున్నాం. విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 22న విడుదల చేస్తున్నాం. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ అందించిన సంగీతం స్పెషల్‌ హైలైట్‌ అని చెప్పాలి. ఎప్పుడూ డిఫరెంట్‌ సినిమాలను చేస్తూ మంచి పేరు తెచ్చుకునే ధనుష్‌ తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని ఒక అద్భుతమైన క్యారెక్టర్‌ ఈ సినిమాలో చేశారు. ఒక యదార్థ సంఘటన ఆధారంగా భరత్‌బాల రూపొందించిన ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అవుతుంది. తమిళ్‌లో ఆస్కార్‌ రవిచంద్రన్‌గారు నిర్మించిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని సాధించింది. తెలుగు ప్రేక్షలకు కూడా ఆదరిస్తారన్న నమ్మకంతో ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్‌ 22న విడుదల చేస్తున్నాం'' అన్నారు.

More News

దసరా కానుకగా ఈ నెల 22న రాబోతున్న 'ప్లేయర్'

ట్రిపుల్ ఎక్స్ సోప్ యాడ్ తో నటుడిగా పరిచయం అయిన పర్వీన్ రాజ్ ఇప్పుడు హీరోగా మారాడు.

డీ గ్లామర్డ్ రోల్ లో తెలుగమ్మాయి

పేరుకి తెలుగమ్మాయిలు అయినా..తెలుగులో కంటే తమిళంలోనే మంచి అవకాశాలను పొందుతూ దూసుకుపోతున్న వారి జాబితా ఈ మధ్య బాగానే ఉన్న సంగతి తెలిసిందే.

'బ్రహ్మోత్సవం' హిట్ సెంటిమెంట్

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'వంటి సక్సెస్ ఫుల్ మూవీ తరువాత మహేష్బాబుతో శ్రీకాంత్ అడ్డాల రూపొందిస్తున్న చిత్రం'బ్రహ్మోత్సవం'.

దసరా కానుకగా ప్రారంభం కానున్న'ఎవడో ఒకడు'

మాస్ మహారాజా రవి తేజ హీరో గా, మళయాళ చిత్రం ‘ప్రేమం’ తో యువకుల మనసులు దోచుకున్న అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా త్వరలో 'ఎవడో ఒకడు' అనే చిత్రం రాబోతోంది.

ఆ..స్టెప్పు చరణ్ కి నచ్చలేదు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం బ్రూస్ లీ.ఈ చిత్రంలో చరణ్ వేసిన ఫ్లూట్ స్టెప్ చూస్తుంటే..ఇంద్ర సినిమాలో చిరంజీవి వీణ స్టెప్పు గుర్తుకువస్తుంది.