BiggBoss: లాస్ట్ మినిట్ వరకు టెన్షన్.. మెరీనా సేఫ్, వాసంతి ఎలిమినేట్
Send us your feedback to audioarticles@vaarta.com
సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్లుగానే ఈవారం డబుల్ ఎలిమినేషన్ షాకిచ్చాడు బిగ్‌బాస్. శనివారం బాలాదిత్యను ఇంటికి పంపగా.. ఆదివారం గ్లామర్ క్వీన్ వాసంతిని ఎలిమినేట్ చేశాడు. అయితే ఈరోజు ఎపిసోడ్ మాత్రం ఊహకందని ట్విస్టులతో సాగింది. షో చూసినవారంతా మెరీనానే ఎలిమినేట్ అవుతుందని భావించారు. కానీ వాసంతినే బయటకు వెళ్లాల్సి వచ్చింది.
సండే ఎప్పటిలాగే గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. నామినేషన్స్‌లో వున్న ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు . కీర్తి, ఫైమా, రేవంత్, ఆదిరెడ్డి, ఇనయా, శ్రీహాన్‌లు సేవ్ అయ్యారు. చివరికి మెరీనా, వాసంతి మిగలడంతో ఇంటి సభ్యుల్లో టెన్షన్ పీక్స్‌కి వెళ్లింది. ఎందుకంటే ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావడం పక్కా. వీరిద్దరి ముందు ఫిష్ బౌల్స్ పెట్టి.. వారి చేతికి కాగితం పువ్వు ఇచ్చారు. ఆ పువ్వును నీటిలో ముంచినప్పుడు ఎవరి నీటిలో అయితే ఎరుపురంగు కనిపిస్తుందో వారు ఎలిమినేట్ అవుతారు. వాసంతి బౌల్‌లో ఎరుపు రంగు కనిపించడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించారు. దీంతో కంటెస్టెంట్స్ షాక్‌కు గురయ్యారు. హౌస్‌లో వున్నన్ని రోజులు ఎవరితోనూ గొడవ పెట్టుకోకుండా తన పని తాను చూసుకునే వాసంతి అంటే అందరికీ ఇష్టమే. దీంతో ఆమె ఎలిమినేషన్‌ను వారు తట్టుకోలేకపోయారు.
ఇంటిని వీడేందుకు వాసంతికి కూడా బాధగానే వుంది. కానీ గీతూ రేంజ్‌లో పర్ఫామెన్స్ చేయకుండా కన్నీళ్లతోనే బయటకు వచ్చింది. అనంతరం స్టేజ్‌పై ఆమె జర్నీని చూపించారు నాగార్జున. ఈ సందర్భంగా ఇంట్లో బెస్ట్ ఫ్రెండ్స్, ఫేక్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పాలని నాగ్ కోరారు. దీనికి మెరీనా, కీర్తి, ఇనయా, రేవంత్‌లు మంచి ఫ్రెండ్స్ అని నలుగురి పేర్లు మాత్రమే చెప్పింది. రాజ్, ఆదిరెడ్డి, ఫైమాలు తనకు పెద్దగా పరిచయం లేదని తెలిపింది. తనకు అందరూ ఇష్టమేనని.. తాను ఎవరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదని చెప్పింది. చివరిలో నీ డ్రెస్ బాగుందని రేవంత్ కాంప్లిమెంట్ ఇవ్వగా.. హౌస్‌లో వున్నప్పుడు చెప్పవు, ఇప్పుడు చెబుతున్నావా అంటూ అలిగింది. మొత్తం మీద మెరీనా ఎలిమినేట్ అవుతుందనుకున్న టైంలో దురదృష్టవశాత్తూ వాసంతి బయటకు వెళ్లింది. ఇప్పుడిప్పుడే టాస్క్‌ల్లో బాగా పర్ఫామెన్స్ చేస్తోంది అనుకుంటున్న సమయంలో వాసంతి ఎలిమినేషన్ అందరికీ షాకిచ్చింది.
ఇకపోతే... బాలాదిత్య, వాసంతిల ఎలిమినేషన్‌లో ఇంటిలో పది మంది మాత్రమే మిగిలారు. వీరిలో ఒకరే విజేత అని.. వారికి రూ.50 లక్షల ప్రైజ్ మనీ దక్కుతుందని నాగార్జున అనౌన్స్ చేస్తూ లోగోను ఆవిష్కరించారు. ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతున్న కొద్ది గేమ్ చాలా టఫ్‌గా మారుతోంది. బిగ్‌బాస్ ఇక చివరి అంకానికి చేరుకోవడంతో రాబోయే రోజుల్లో ఆట మరింత ఉత్కంఠగా సాగనుంది. మరి ఈ పది మందిలో బిగ్‌బాస్ టైటిల్ విజేత ఎవరో ..?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments