BiggBoss: భర్త కోసం మెరీనా త్యాగం... టైటిల్ కొడతానంటూ శ్రీహాన్‌తో ఇనయా సవాల్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 6 ఐదో వారంలో ప్రవేశించింది. ఆదివారం ఆరోహి ఎలిమినేట్ కావడంతో ఇంటి సభ్యులంతా ఉద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇనయా, కీర్తి, ఆర్జే సూర్యలు తట్టుకోలేకపోయారు. ఆమె స్టేజ్ దిగి వెళ్లే వరకు వీరు ఏడుస్తూనే వున్నారు. ఇక సోమవారం కావడంతో నామినేషన్స్ ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు బిగ్‌బాస్. అయితే నామినేషన్ డే అనగానే గొడవలు, ఫైటింగ్‌లు మామూలుగా వుండవు.. ఆడియన్స్‌కి కూడా వినోదం పంచేది అదే. ఎప్పుడూ ఇంటి సభ్యులకు ఇద్దరిని ఎంచుకుని వారిని నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. కానీ ఈసారెందుకో బిగ్‌బాస్ వారికి అవకాశం ఇవ్వలేదు. తానే ఇద్దరినీ ఎంపిక చేసి.. వారిద్దరిలో ఒకరిని నామినేట్ అవ్వాల్సిందిగా కోరాడు. గార్డెన్ ఏరియాలో సంకెళ్లు పెట్టి... తాము చెప్పినప్పుడు ఇద్దరు ఇంటి సభ్యులు వెళ్లి ఆ సంకెళ్లను చేతికి వేసుకుని రావాలి. ఎవరు నామినేట్ అవ్వాలో వాళ్లలో వాళ్లే తేల్చుకోవాలి.
అంతేకాదు... ఈ వారం నుంచి రోహిత్, మెరీనాలు జంటగా ఆడరని, విడివిడిగానే ఆడతారని బిగ్‌బాస్ చెప్పడంతో హౌస్ మొత్తం షాక్ అయ్యింది. వారిద్దరినే పిలిచి ఎవరు నామినేట్ అవుతారో తేల్చుకోవాలని చెప్పడంతో మెరీనా.. భర్త కోసం త్యాగం చేసింది. నేను వున్నా, లేకున్నా నువ్వు హౌస్‌లోనే వుండాలంటూ త్యాగం చేసింది. తర్వాత వాసంతి- సుదీపలో వాసంతి, శ్రీసత్య- అర్జున్‌లలో అర్జున్, ఇనయా- శ్రీహాన్‌లలో ఇనయా, ఆదిరెడ్డి- రేవంత్‌లలో ఆదిరెడ్డి, ఆర్జే సూర్య- ఫైమాలలో ఫైమా, గీతూ- చంటిలలో చంటి, బాలాదిత్య- రాజ్‌లలో బాలాదిత్య నామినేట్ అయ్యారు. మొత్తంగా ఈ వారం మెరీనా, ఇనయా, వాసంతి, అర్జున్, ఆదిరెడ్డి, ఫైమా, ఆదిత్య, చంటిలు నామినేషన్లలో నిలిచారు.
ఇకపోతే.. ఈ రోజు అన్నింటికంటే హైలెట్ ఇనయా- శ్రీహాన్ మధ్య గొడవే. ఎవరైతే శత్రువుల్లా వుంటున్నారో... వారిద్దరిని కలిసి బేడీలు వేసుకుని రమ్మనడంతో హౌస్ మొత్తం షాక్ అయ్యింది. ఇప్పటికే శ్రీహాన్ తనపై ఏజ్ షేమింగ్ కామెంట్స్ చేశాడని రెండు వారాలుగా ఇనయా రగిలిపోతున్న సంగతి తెలిసిందే. అలాంటి వారిద్దరిని మీలో ఎవరు నామినేట్ అవ్వాలని అనుకుంటున్నారో తేల్చుకోమనడం నిజంగా విశేషం. అనుకున్నట్లుగానే .. సంకెళ్లు పడిన నెక్స్ట్ మినిట్ ఇనయాను రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు. నువ్వు కెప్టెన్ కాలేవని కామెంట్స్ చేశాడు. దీనికి ఇనయా ధీటుగానే బదులిచ్చింది. నాకు కెప్టెన్ అయ్యే అర్హల లేదంటావా.. ఆడి అయ్యి చూపిస్తానంటూ శపథం చేసింది. నేనే నామినేట్ అవుతున్నా...ఫైట్ చేసి టైటిల్ కొట్టి మరీ వెళ్తాను అని తేల్చిచెప్పింది.
అటు తనపై అర్జున్ చూపిస్తోన్న ప్రేమను మరోసారి శ్రీసత్య వాడుకుంది. ఇప్పటికే ఇంటిలో వీరిద్దరిని లవ్ బర్డ్స్ అంటూ ఆట పట్టిస్తోన్న సంగతి తెలిసిందే. కానీ నామినేషన్ల వల్ల వీరిద్దరి మధ్య గ్యాప్ వస్తుందని అంతా భావించారు. కానీ శ్రీసత్య- అర్జున్‌లు చాలా చాకచక్యంగా డీల్ చేశారు. శ్రీసత్యను చూస్తూ మైమరిచిపోయిన అర్జున్ తానే నామినేట్ అయినట్లు చెప్పారు. ఇప్పటికే బిగ్‌బాస్ ఏ సీజన్లోనూ ఏ కంటెస్టెంట్ రెండోసారి జైలుకు వెళ్లలేదు. దానిని మనోడు సొంతం చేసుకున్నాడు. అతను జైల్లోకి వెళ్లిన తర్వాత శ్రీసత్య రియలైజ్ అయ్యింది. అతని దగ్గర కూర్చొని .. నువ్వు బిగ్‌బాస్ హౌస్‌కి ఎందుకొచ్చావ్, నా కోసమా.. నీ కోసమా అని ప్రశ్నించింది. దీనికి నా కోసమే అని చెప్పిన అతను.. కెమెరాల వైపు చూస్తూ ఒక్క ఛాన్స్ ఇస్తే .. నా గేమ్ ఏంటో చూపిస్తాని చెప్పాడు. మరి నామినేషన్‌కి అంగీకరించడం ఏంటంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com