Marina Abraham : బిగ్‌బాస్‌లో 11 వారాల పాటు... మరి మెరీనాకు ఎంత ముట్టిందంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ తెలుగు 6 చివరి అంకానికి చేరుకుంది. ఒక్కొక్క కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతూ వుండటంతో షో ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. ఇకపోతే.. గతవారం మెరీనా అబ్రహం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. గలాటా గీతూ ఎలిమినేషన్ తర్వాత అత్యంత ఎమోషనల్‌గా సాగిన ఎపిసోడ్ మెరీనాదే. భర్తతో కలిసి జంటగా ఇంటిలోకి అడుగుపెట్టిన మెరీనా అన్నపూర్ణలా అందరి కడుపు నింపింది. తొలుత సుదీప ఈ బాధ్యతలు నిర్వర్తించగా.. తర్వాత మెరీనా అమ్మలా మారింది. టాప్ 5లో ఉంటారని ఖచ్చితంగా భావించినప్పటికీ.. ఓటింగ్‌ను బట్టి మెరీనా ఎలిమినేట్ కాకతప్పలేదు. బిగ్‌బాస్ హౌస్‌లో ఎలాంటి వివాదం లేకుండా కడిగిన ముత్యంలా బయటకు వచ్చిన వారిలో మెరీనా కూడా ఒకరు. అక్కడక్కడా కొన్ని గొడవలు జరిగినా.. అవేవి అంత పెద్దవి కావు. అందుకే ఆవిడ ఎలిమినేట్ అవుతున్నారని తెలిసి అంతా ఎమోషనల్ అయ్యారు.
వారానికి రూ.35 వేలు :
మెరీనా ఎలిమినేషన్ తర్వాత ఇప్పుడు అంతా ఒక విషయం గురించే చర్చించుకుంటున్నారు. ఆవిడ 11 వారాలు వున్నందుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు... రోజుకు ఎంత పడింది..? ఈ విషయాల గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మెరీనాకు బిగ్‌బాస్ భారీగా పారితోషికం ముట్టజెప్పినట్లుగా తెలుస్తోంది. వారానికి 35 వేల రూపాయల చొప్పున రెమ్యూనరేషన్ దక్కినట్లుగా సమాచారం. అలా 11 వారాలకు గాను దాదాపు రూ.3,85,000 అందినట్లుగా తెలుస్తోంది.
మెరీనా ఎలిమినేషన్‌పై విమర్శలు:
మరోవైపు.. మెరీనా ఎలిమినేషన్‌పై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. గతంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, సీక్రెట్ రూమ్‌లు, గెస్ట్ అప్పియరెన్స్‌లు వుంటూ బిగ్‌బాస్ ఇంట్రెస్టింగ్‌గా సాగేది. అయితే ఈసారి మంచి మంచి కంటెస్టెంట్స్‌ని ఎలిమినేట్ చేస్తూ... ఉత్కంఠ కలిగిస్తున్నారు. తాజాగా మెరీనా ఎలిమినేషన్ విషయంలోనూ అదే జరుగుతోంది. శ్రీసత్య, మెరీనాలు ఓటింగ్‌లో ఒకే రేంజ్‌లో వుండగా.. శ్రీసత్యను సేవ్ చేసి మెరీనాను ఇంటికి పంపారు. నిజానికి శ్రీసత్యను ఎలిమినేట్ చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కోరుతున్నారు ఆడియన్స్. అంతేకానీ మెరీనా విషయంలో ఎలాంటి డిమాండ్లు రాలేదు. అలాంటిది సత్యను సేవ్ చేసి మెరీనాను ఇంటికి ఎందుకు పంపారంటూ ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై బిగ్‌బాస్ నిర్వాహకులు ఎలాంటి ఆన్సర్ ఇస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments