మార్చి 4 న 5 సినిమాలు రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకే రోజు రెండు మూడు సినిమాలు రిలీజ్ చేయడానికే ఇష్టపడని దర్శకనిర్మాతలు ఇప్పుడు ఒకే రోజు నాలుగైదు సినిమాలు రిలీజ్ చేసేస్తున్నారు. సంక్రాంతికి నాలుగు సినిమాలు పోటీపడిన విషయం తెలిసిందే. తాజాగా మార్చి 4న 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మార్చి నెలాఖరు నుంచి పెద్ద సినిమాల రిలీజ్ స్టార్ట్ అవుతుండడంతో చిన్న సినిమాలను మార్చి మొదటివారం నుంచి రిలీజ్ చేస్తున్నారు.
మార్చి 4న మంచు మనోజ్ - దశరథ్ కాంబినేషన్లో రూపొందిన శౌర్య సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే అడవి శేషు హీరోగా రూపొందిన థ్రిల్లర్ మూవీ క్షణం, నాగశౌర్య హీరోగా నందినీ రెడ్డి తెరకెక్కించిన కళ్యాణ వైభోగమే, శ్రీకాంత్ హీరోగా నటించిన యాక్షన్ మూవీ టెర్రర్ మార్చి 4న రిలీజ్ అవుతున్నాయి. ఈ నాలుగు స్ట్రైయిట్ మూవీస్ తో పాటు డబ్బింగ్ మూవీ శివ గంగ కూడా మార్చి 4 నే రిలీజ్ ప్లాన్ చేసారు. మరి..మార్చి 4న ఈ ఐదు సినిమాలు రిలీజ్ అవుతాయో...లేక ఎవరైనా వెనక్కి తగ్గి రిలీజ్ వాయిదా వేస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com