మార్చి 4 న 5 సినిమాలు రిలీజ్

  • IndiaGlitz, [Tuesday,February 16 2016]

ఒకే రోజు రెండు మూడు సినిమాలు రిలీజ్ చేయ‌డానికే ఇష్ట‌ప‌డ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇప్పుడు ఒకే రోజు నాలుగైదు సినిమాలు రిలీజ్ చేసేస్తున్నారు. సంక్రాంతికి నాలుగు సినిమాలు పోటీప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా మార్చి 4న 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మార్చి నెలాఖ‌రు నుంచి పెద్ద సినిమాల రిలీజ్ స్టార్ట్ అవుతుండ‌డంతో చిన్న సినిమాల‌ను మార్చి మొద‌టివారం నుంచి రిలీజ్ చేస్తున్నారు.

మార్చి 4న మంచు మ‌నోజ్ - ద‌శ‌ర‌థ్ కాంబినేష‌న్లో రూపొందిన శౌర్య సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే అడ‌వి శేషు హీరోగా రూపొందిన థ్రిల్ల‌ర్ మూవీ క్ష‌ణం, నాగశౌర్య హీరోగా నందినీ రెడ్డి తెర‌కెక్కించిన క‌ళ్యాణ వైభోగ‌మే, శ్రీకాంత్ హీరోగా న‌టించిన యాక్ష‌న్ మూవీ టెర్ర‌ర్ మార్చి 4న రిలీజ్ అవుతున్నాయి. ఈ నాలుగు స్ట్రైయిట్ మూవీస్ తో పాటు డ‌బ్బింగ్ మూవీ శివ గంగ కూడా మార్చి 4 నే రిలీజ్ ప్లాన్ చేసారు. మ‌రి..మార్చి 4న ఈ ఐదు సినిమాలు రిలీజ్ అవుతాయో...లేక ఎవ‌రైనా వెనక్కి త‌గ్గి రిలీజ్ వాయిదా వేస్తారో చూడాలి.

More News

సందీప్ కిషన్ నిత్యా మీనన్ 'ఒక్క అమ్మాయి తప్ప' చిత్రం టాకీ పూర్తి

'ప్రస్థానం' వంటి డిఫరెంట్ మూవీతో సినిమా రంగానికి పరిచయమైన యంగ్ హీరో సందీప్ కిషన్.'రొటీన్ లవ్ స్టోరి',వెంకటాద్రి ఎక్స్ ప్రెస్,బీరువా,టైగర్ వంటి విలక్షణమైన చిత్రాలతో మంచి సక్సెస్ లు సాధించారు.

మహేష్ మూవీకి బడ్జెట్ ఫిక్స్ చేసిన మురుగుదాస్..

సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం చిత్రంలో నటిస్తున్నారు.ఈ చిత్రం మే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

బాహుబలి రికార్డ్ ను క్రాస్ చేసిన ఎన్టీఆర్...

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - దర్శకథీర రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన బాహుబలి ఎంతటి సంచలనం సృష్టించిందో...ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో తెలిసిందే.

నాని డబుల్ 'ధమాకా'

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న హీరో నాని ఇప్పుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

కృష్ణాష్ట‌మిలో బ్ర‌హ్మి కొత్త అవ‌తారం

బ్ర‌హ్మానందం కు గ‌త సంవ‌త్సరం నుంచి స‌రైన సినిమా రాక‌పోవ‌డం...అత‌ని క్యారెక్ట‌ర్ పండ‌క‌పోవ‌డంతో...ఇక బ్ర‌హ్మి ప‌నైపోయింది అనుకున్నారు.