ఈ నెల 25న అమ్మాయి - ఆరుగురు రిలీజ్...

  • IndiaGlitz, [Monday,March 14 2016]
నూత‌న న‌టీన‌టులు రామ‌చంద్ర‌చౌద‌రి,ఆశాల‌త జంట‌గా ముర‌ళీ తెర‌కెక్కించిన చిత్రం అమ్మాయి - ఆరుగురు. ఈ చిత్రాన్ని రామ‌చంద్ర చౌద‌రి నిర్మించారు. ఈ నెల 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సంద‌ర్భంగా
హీరో & నిర్మాత రామ‌చంద్ర చౌద‌రి మాట్లాడుతూ..ఇది బావ - మ‌ర‌ద‌ళ్ల ప్రేమ‌క‌థా చిత్రం. కాలేజీలో ఆరుగురు అబ్బాయిలు చ‌దువుకోవ‌డం మానేసి ర్యాగింగ్ చేస్తూ అమ్మాయిల‌ను ఏడిపిస్తుంటారు. ఎదురు తిరిగితే హింసించి చంపేస్తుంటారు. హీరోయిన్ ఆశాల‌త‌ను కూడా అలాగే హింసించి చంపేస్తారు.ఆత‌ర్వాత‌ హీరోయిన్ దెయ్యంగా మారి ఆరుగుర్ని ఎలా చంపింది అనేదే ఈ చిత్ర‌క‌థ‌. ఈ త‌ర‌హా సినిమాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఈ సినిమా కొత్త‌గా ఉంటుంది. డైరెక్ట‌ర్ ముర‌ళీ కొత్త‌వాడైన‌ప్ప‌టికీ అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుడిలా ఈ సినిమాని తెర‌కెక్కించారు. ఇందులోఐదు పాట‌లు ఉన్నాయి. వందేమాత‌రం సంగీతం - కామెడీ సినిమాకి హైలెట్ అని చెప్ప‌వ‌చ్చు. ఈ నెల 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా రిలీజైన రెండు నెల‌ల్లో కొత్త సినిమాని ప్రారంభిస్తాం అన్నారు.