Marakathamani Review
అడ్వేంచరస్ మూవీస్ అనేవి ప్రేక్షకుల్లో ఓ సస్పెన్స్‌ను, థ్రిల్లింగ్‌ను క్రియేట్ చేసేలా ఉంటేనే ప్రేక్షకుడు సినిమాను ఆదరిస్తాడు. అలాగే అడ్వంచరేస్ మూవీస్‌ను హ్యండిల్ చేయడం అనుకున్నంత సులువు కాదు. ఏ మాత్రం పట్టు తప్పినా సినిమా ప్రేక్షకులను మెప్పించదు. ఇలాంటి రిస్క్ ఉన్నా దర్శకుడు శరవణన్, హీరో ఆదిపినిశెట్టితో చేసిన ప్రయత్నమే మరకతమణి. ఈ సినిమాఎలా ప్రేక్షకులను మెప్పించదనే విషయం తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం.
కథ:
రఘనందన్(ఆది పినిశెట్టి) తనకు ఉన్న అప్పులను తీర్చడానికి రాందాస్(రాందాస్) అనే స్మగ్లింగ్ గ్యాంగ్‌లో చేరుతాడు. కానీ చిన్న చిన్న దొంగతనాలు చేయడం రఘు ఇష్టపడడు. అదే సమయంలో అలేఖ్య(నిక్కి గర్లాని)ని ప్రేమిస్తాడు. అలేఖ్య మాత్రం వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకుంటుంది. ఓ వ్యక్తి కారనంగా రఘుకి మరకతమణి గురించి తెలుస్తుంది. ఆ మణిని ఎలా చేజిక్కించుకోవాలనే రఘు ప్రయత్నాలు మొదలు పెడతాడు. మరకతమణిని తాకిన 132 మంది చనిపోయారని, వారు ఆత్మలుగా మారారని రఘుకి ఓ స్వామిజీ ద్వారా తెలుస్తుంది. ఆ స్వామిజీయే ఆ మణిని సాధించడానికి మార్గం చెబుతాడు. ఆ మార్గంలో తన స్నేహితుడు బుజ్జిబాబు, చనిపోయిన మావయ్య ఆత్మను సహాయానికి పిలుస్తారు. సదరు ఆత్మ తన స్నేహితుల ఆత్మలను కూడా పిలుచుకు వస్తుంది. అందరూ కలిసి మరకతమణి అన్వేషణలో పడతారు. సెర్చింగ్‌లో రఘు అండ్ టీంకు, ట్వింకిల్ రామనాథన్(అనంత్ రాజ్) గ్యాంగ్‌కు పోటీ వస్తుంది. ఆ గ్యాంగ్ కూడా రఘు టీంను పట్టుకుని మణిని సంపాదించుకోవాలేనుకుంటుంది. అప్పుడు రఘు ఏం చేస్తాడు? మణిని సంపాదిస్తాడా? రఘు సమస్యలు తీరిపోయాయా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ:
దర్శకుడు శరవణన్ అడ్వెంచరెస్ మూవీని అడ్వెంచర్ తరహాలో సీరియస్‌గా కాకుండా కామెడిగా నడిపించాడు. కథ ప్రారంభం నుండి చివరి వరకు సినిమా కామెడి టచ్‌తోనే ముందుకు సాగుతుంది.అలాగే మరకత మణి అంటే ఏదో కొండలు, గుట్టలు దాటాలి అనేటట్లు కాకుండా సినిమాను తక్కువ బడ్జెట్‌లోనే చక్కగా డ్రైవ్ చేశాడు దర్శకుడు. హీరో, ఆత్మలను ఆహ్వానించడం, ఆ ఆత్మలు వీరితో పండించే కామెడి ప్రేక్షకులను ఆట్టుకుంటుంది. అలాగే నిక్కి గర్లాని మగ గొంతు ఉన్న వస్తాదు తరహా ఆత్మగా చక్కగా నటించింది. ఈ సినిమాలో నిక్కి గ్లామర్‌కు పెద్ద ఆస్కారం లేదు. రాందాస్ సినిమాలో కామెడిని పండించడంలో కీ రోల్‌ను పోషించాడు. ఎక్కడా డబుల్ మీనింగ్ లేని కామెడి ట్రాక్ ఆకట్టుకుంది. విలన్ గ్యాంగ్ హీరో గ్యాంగ్‌ను చిత్ర హింసలు పెట్టాలనుకునే సందర్భంలో కూడా కామెడిట్రాక్ నవ్విస్తుంది. మలుపు తర్వాత ఆది పినిశెట్టి హీరోగా చేసిన ఈ సినిమా తనకు మంచి పేరునే తెస్తుందనడంలో సందేహం లేదు. అలాగే తను స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నాడనేది అర్థమవుతుంది. అలాగే అనంత్‌రాజ్ కూడా ఇందులో సీరియస్‌గా ఉంటూనే కామెడి పండించడం, అనంత్ రాజ్ వాడే రేడియో, దాని వల్ల వచ్చే కామెడి అన్ని అందరినీ అలరిస్తాయి. సినిమాటోగ్రాఫర్ శంకర్ పనితీరు చాలా బావుంది. చక్కగా పిక్చరైజ్ చేశాడు. ఇక దిబునినన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యింది. అయితే సినిమలో ఎక్కువగా తమిళ నెటివిటీ కనపడుతుంది. కాబట్టి సినిమా తెలుగు ప్రేక్షకులకు ఆట్టుకుంటుందా అనే విషయంలో సందేహం వస్తుంది. లాజిక్స్ మిస్ అయ్యాయి. బ్రహ్మానందం క్యారెక్టర్‌ను అనవసరంగా ఇరికించనట్లుంది. మొత్తం మీద సినిమా చూసిన ప్రేక్షకుడు ఓ స్మైల్‌తో బయటకు వస్తాడు.
బోటమ్ లైన్: మరకతమణి.. నవ్వించే సస్పెన్స్ థ్రిల్లర్
Marakathamani English Version Review
- Read in English