మావోల రివెంజ్..15 మంది కమాండోలు మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
మహారాష్ట్రలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బుధవారం మధ్యాహ్నం మూడు డజన్ల వాహనాల్ని తగలబెట్టారు. దీంతో గడ్చిరోలి మరోసారి శక్తిమంతమైన బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఓ వాహనంలో వెళ్తున్న 15 మంది కమాండోలను టార్గెట్ చేసిన మావోయిస్టులు అత్యంత శక్తిమంతమైన IEDలతో పేలుడుకు పాల్పడ్డారు. ఈ భారీ పేలుళ్లతో కమాండోలు ప్రయాణిస్తున్న వాహనం తుక్కుతుక్కైంది. ఈ ఘటనలో 15 మంది జవాన్లు, ఓ డ్రైవర్ చనిపోయారు. కాగా.. ఇవాళ మహారాష్ట్ర వ్యవస్థాపక దినం జరుగుతుండగా మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. కాలిపోయిన వాహనాల్లో చాలావరకూ అమర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థకు చెందినవే. నేషనల్ హైవే 136 దగ్గర్లో పురాడా-యర్కాడ్ దగ్గర అభివృద్ధి నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే.. గతేడాది ఏప్రిల్ 22న భద్రతా దళాలు 40 మంది మావోయిస్టులను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా మావోయిస్టులు ఈ దాడులకు పాల్పడినట్లు మావోయిస్టులు కొన్ని బ్యానర్లు, పోస్టర్లను దాడి చేసిన ప్రదేశంలో వదిలి వెళ్లారు. కాగా.. గత 24 గంటల్లో మావోల దాడులు చేయడం ఇది రెండోసారి..అంతకు ముందు జిల్లాలో 30 వాహనాలను దగ్దం చేసిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments