మావోల రివెంజ్..15 మంది కమాండోలు మృతి

  • IndiaGlitz, [Wednesday,May 01 2019]

మహారాష్ట్రలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బుధవారం మధ్యాహ్నం మూడు డజన్ల వాహనాల్ని తగలబెట్టారు. దీంతో గడ్చిరోలి మరోసారి శక్తిమంతమైన బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఓ వాహనంలో వెళ్తున్న 15 మంది కమాండోలను టార్గెట్ చేసిన మావోయిస్టులు అత్యంత శక్తిమంతమైన IEDలతో పేలుడుకు పాల్పడ్డారు. ఈ భారీ పేలుళ్లతో కమాండోలు ప్రయాణిస్తున్న వాహనం తుక్కుతుక్కైంది. ఈ ఘటనలో 15 మంది జవాన్లు, ఓ డ్రైవర్ చనిపోయారు. కాగా.. ఇవాళ మహారాష్ట్ర వ్యవస్థాపక దినం జరుగుతుండగా మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. కాలిపోయిన వాహనాల్లో చాలావరకూ అమర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థకు చెందినవే. నేషనల్ హైవే 136 దగ్గర్లో పురాడా-యర్కాడ్ దగ్గర అభివృద్ధి నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. గతేడాది ఏప్రిల్ 22న భద్రతా దళాలు 40 మంది మావోయిస్టులను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా మావోయిస్టులు ఈ దాడులకు పాల్పడినట్లు మావోయిస్టులు కొన్ని బ్యానర్లు, పోస్టర్లను దాడి చేసిన ప్రదేశంలో వదిలి వెళ్లారు. కాగా.. గత 24 గంటల్లో మావోల దాడులు చేయడం ఇది రెండోసారి..అంతకు ముందు జిల్లాలో 30 వాహనాలను దగ్దం చేసిన సంగతి తెలిసిందే.

More News

'మే' డే వేడుకల్లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్...

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలతో రాష్ట్రం అట్టుడికిన సంగతి తెలిసిందే. బోర్డు తప్పిదాలతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

'ఎంతవారలైనా' ఆడియో, ట్రైలర్‌ చాలా బాగుంది.. సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది - నిర్మాత కె.అచ్చిరెడ్డి

సంహిత, చిన్ని - చింటు సమర్పణలో రామదూత ఆర్ట్స్‌ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి నటిస్తూ..

'ఇస్మార్ట్ శంక‌ర్' కు స్ఫూర్తి ఆ చిత్ర‌మేనా?

సాధార‌ణంగా మ‌న టాలీవుడ్ ద‌ర్శ‌కుల్లో చాలా మంది ఇత‌ర భాషా చిత్రాల నుండి ప్రేర‌ణ పొంది క‌థ‌ల‌ను త‌యారు చేసుకుంటారు.

'RRR' టైటిల్‌పై యూనిట్ ఏమంటుందో తెలుసా!

టాలీవుడ్ ప్రెస్టీజియ‌స్ మూవీ `RRR` త్వ‌ర‌లోనే మూడో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించుకోనుంది.

మే 31న 'సువర్ణ సుందరి' విడుదల

పూర్ణ,  సాక్షి చౌదరి , జయప్రద   ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న చిత్రం "సువర్ణసుందరి".