మే 6న మళ్లీ వస్తున్న 'మన్యం పులి'
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై 'సింధూరపువ్వు' కృష్ణారెడ్డి నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన సినిమా 'మన్యంపులి'. మల్లూవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన ఈ విజువల్ వండర్ మళ్లీ విడుదలకి సిద్ధమైంది. మే 6న 'మన్యం పులి' సెకండ్ రిలీజ్ కి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినట్లుగా నిర్మాత సింధూరపువ్వ కృష్ణారెడ్డి ప్రకటించారు. భారీ స్థాయిలో 'మన్యంపులి' విడుదల చేస్తున్నట్లు సరస్వతి ఫిలిమ్స్ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో 'మన్యంపులి' విడుదలైన సమయంలో నోట్ల రద్దు ప్రభావం ఉండటంతో చాలా మంది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడలేకపోయారని, వారి కోసమే మళ్లీ 'మన్యంపులి' రీ రిలీజ్ కి సిద్ధమైనట్లు నిర్మాత తెలిపారు. అలానే చాలా మంది ఎగ్జిబిటర్స్ కూడా 'మన్యంపులి'ని మళ్లీ విడుదల చేయాలని కోరడం, పైగా వేసవి సెలవులు నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మరోసారి కూడా ఆదిరిస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సరస్వతి ఫిలిమ్స్ యూనిట్ సభ్యులు. ఇక ఈ సినిమాకు గాను స్పెషల్ జ్యూరీ నేషనల్ అవార్డ్ అందుకున్న మోహన్ లాల్ కి, అలానే ఈ చిత్రంలో అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేసి బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న పీటర్ హేన్స్ కు శుభాకాంక్షలు తెలిపారు సింధూరపువ్వ కృష్ణారెడ్డి. మరి వేసవి కానుకగా మళ్లీ విడుదల అవుతున్న ఈ సినిమాలో జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రలలు పోషించారు, దర్శకుడు: వైశాఖ్, కథ : ఉదయ కృష్ణ, సంగీతం : గోపీ సుందర్, కెమెరా : షాజీ కుమార్, బ్యానర్ : సరస్వతి ఫిల్మ్స్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com