హైదరాబాద్లో ఎక్కడ చూసినా టులెట్ బోర్డులే..
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకప్పుడు హైదరాబాద్లో ఇల్లు అద్దెకు కావాలంటే గగనమే. చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేది. అప్పుడు కానీ దొరికేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. హైదరబాద్లోని ఏ వీధికి వెళ్లినా తక్కువలో తక్కువ రెండు టు లెట్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. లాక్డౌన్ వన్ సమయంలో ఎక్కువ శాతం ప్రజలు నగరాలను ఖాళీ చేసి సొంతూళ్లకు వెళ్లిపోయారు. తాజాగా లాక్డౌన్ 2 విధించనున్నారని వార్తలు రావడంతో దాదాపుగా సగం హైదరాబాద్ ఖాళీ అయిపోయింది.
ముఖ్యంగా వివిధ కాంపిటేటివ్ పరీక్షల కోసం కోచింగ్ ఇచ్చేందుకు పెద్ద మొత్తంలో కోచింగ్ సెంటర్స్ ఉన్న చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, నారాయణగూడ, దిల్సుఖ్నగర్ తదితర ఏరియాల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో అద్దెకు గదులు తీసుకుని ఉండేవారు. మరోవైపు సాఫ్ట్వేర్ కోర్సులకు ట్రైనింగ్ ఇచ్చే సెంటర్స్ అన్నీ అమీర్పేట్లో ఉన్నాయి. విద్యార్థులతో నిత్యం రద్దీగా ఉండే ఈ ఏరియాలన్నీ ఖాళీ అయిపోయాయి. విద్యార్థులంతా తమ సొంతూళ్ళ్లకు వెళ్లిపోయారు.
మరోవైపు సంస్థలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్ చేయడంతో ఉద్యోగస్తులు కూడా తమ తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. కస్టమర్స్ వచ్చే దిక్కు లేకపోవడంతో ఫుడ్ సెంటర్స్, బ్యూటీ పార్లర్లు, సెలూన్లన్నీ మూతబడ్డాయి. అలాగే వివిధ దుకాణాల్లో పని చేసే కూలీలంతా తమ గ్రామాలకు వెళ్లిపోయారు. దీంతో మొత్తంగా నగరంలో ఎన్నో ఇళ్లకు టులెట్ బోర్డులు వేలాడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout