మరోసారి హీరోగా...
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోలుగా అవతారం ఎత్తిన కమెడియన్స్లో శ్రీనివాసరెడ్డి ఒకరు. గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా, ఆనందో బ్రహ్మలో కూడా ఓ రకంగా హీరో పాత్రలో నటించాడు. ఇప్పుడు మరోసారి శ్రీనివాసరెడ్డి హీరోగా కనిపించబోతున్నారని సమాచారం.
గతంలో సుమంత్ అశ్విన్ హీరోగా `రైట్ రైట్` సినిమాను డైరెక్ట్ చేసిన మను అనే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తాడట. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తాడట. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరగుతుందని సమాచారం.
త్వరలోనే సినిమాకు సంబంధించిన వివరాలు తెలుస్తాయి. ఓ పక్క హీరోగా చేస్తూనే శ్రీనివాసరెడ్డి, కమెడియన్గా కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com