మధురం అనే షార్ట్ ఫిలిం ద్వారా పరిచయమైన దర్శకుడు ఫణీంద్ర దర్శకుడు ఫీచర్ ఫిలిం చేశాడనగానే ఎలా చేస్తాడో అనుకున్నారు. అది గాక బిగ్గెస్ట్ క్రౌడ్ ఫండింగ్ మూవీ కూడా ఇదే. ఫణీంద్రపై నమ్మకంతో చిత్ర యూనిట్‌తో సహా 115 మంది `మను` సినిమా నిర్మాణంలో భాగమయ్యారు. బ్రహ్మానందం తనయుడు రాజాగౌతమ్ మూడున్నరేళ్లు కేవలం ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యారు. టీజర్, ట్రైలర్ పెంచిన అంచనాలు, దర్శకుడికి ఉన్న పేరు సినిమాపై అంచనాలు పెంచాయి. మరి మను ఈ అంచనాలను రీచ్ అయ్యిందా? లేదా? అనే విషయం తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం...
కథ:
మను(రాజా గౌతమ్) ఓ పెయింటర్. ఈస్ట్ కోస్ట్ దగ్గరలో ఓ ద్వీపంలో ఉంటుంటాడు. అతని పెయింటింగ్స్‌ను ఇష్టపడేవారిలో నీల(చాందిని చౌదరి) ఒకటి. ఫోటోగ్రాఫర్ అయిన నీల. ఇద్దరూ ముందు గొడవ పడినా.. ఇద్దరు ప్రేమలో పడతారు. ఒకరి ప్రేమను మరొకరు వ్యక్తం చేసుకోవాలనుకుంటారు. మరోవైపు నీల తండ్రి ఓ వజ్రాల వ్యాపారి దగ్గరి విశ్వాస పాత్రుడిగా పనిచేస్తుంటాడు. ఆ వ్యాపారి నీల తండ్రికి ఓ విలువైన వజ్రాన్ని ఇస్తాడు. ఆ విషయం తెలిసిన అమర్, అక్బర్, ఆంటోని అనే ముగ్గురు దొంగల కన్ను పడుతుంది. వారు ముగ్గురు నీల తండ్రిని చంపేస్తారు. ఆ సమయంలోనే రంగ(అభిరామ్ వర్మ) అనే దొంగ.. నీలను హత్య చేస్తాడు. అక్కడి నుండి కథ కొత్త మలుపులు తీసుకుంటుంది. ఇంతకు రంగ నీలను ఎందుకు చంపుతాడు. ముగ్గురు హంతకులపై నీల పగ ఎలా తీర్చుకుంటుంది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
సినిమా స్టార్ట్ అయిన కాసేపటికీ ప్రేక్షకుడు కథకు కనెక్ట్ అవుతాడు. అప్పుడే మిగతా వాటి గురించి అవగతం అవుతాయి. కానీ దర్శకుడు సినిమాను స్క్రీన్‌ప్లేతో మాయ చేయాలని ప్రయత్నించాడు. కథను నడింపించిన తీరుతో అసలు కథ ఏంటో అర్థం చేసుకోవాలనుకునే ప్రేక్షకుడికి డైవర్ట్ చేసేశాడు. రాజా గౌతమ్ తన గత చిత్రాలకు భిన్నంగా కనిపించాడు. తన లుక్, డైలాగ్ డెలివరీ పరంగా ఆకట్టుకున్నాడు. అలాగే చాందిని చౌదరి పాత్రకు న్యాయం చేసిది. ఇక విలన్స్‌గా నటించిన శ్రీకాంత్, మోహన్ భగత్, జాన్ కొట్టొలి, అభిరామ్ వర్మ అందరూ వారి వారి పాత్రల్లో నటించారు. ఇక సాంకేతిక విషయానికి వస్తే.. ఎక్కువ విషయాలు తెలిసినా దాని వల్ల ఒక్కొక్కసారి అనర్థాలు ఎదురవుతాయి. అలాంటి విషయమే ఫణీంద్ర విషయంలో జరిగింది. తన జ్ఞానాన్ని అంతా ఉపయోగించి దర్శకుడు ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. అది స్క్రీన్‌ప్లేతో తెలిసిపోతుంది. ఎక్కడా జనాలు పెద్దగా కనిపించరు. అదెందుకనేది దర్శకుడికే తెలియాలి. దర్శకుడు ఏదో చెప్పాలని.. ఏదో డార్క్‌లో సన్నివేశాలున్నా.. అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు ప్రేక్షకుడు. అయితే సన్నివేశాల చిత్రీకరణ మరి సాగదీతగా అనిపిస్తుది. దీని వల్ల పోను పోను కథపై ఆసక్తి తగ్గిపోయింది. సెకండాఫ్‌లో వచ్చే ప్రేమకథ, దానికి మిక్స్ అయిన పొయెట్రీ ప్రేక్షకుడి అర్థం కాదు. తికమకగా సినిమా సాగడం వల్ల అయోమయంగా అనిపిస్తుంది.
బోటమ్ లైన్: కొత్త తరహా కథ, కథనాలు అవసరం.. అయితే ప్రేక్షకుడికి ఆసక్తి కలిగేలాఉండాలి. తికమక పెట్టి ప్రేక్షకుడికి ఆకట్టుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రేక్షకుడు అంత సమయం అయితే ఇవ్వడు.
Comments