నిర్వాణ సినిమాస్ విడుదల చెయ్యనున్న 'మను'

  • IndiaGlitz, [Friday,July 06 2018]

నటుడు బ్రహ్మానందం కుమారుడు గౌతమ్, చాందిని చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన 'మను' సినిమా ప్రముఖ యు.ఎస్ డిస్ట్రిబ్యూట్ సంస్థ నిర్వాణ సినిమాస్ విడుదల చెయ్యబోతోంది. 'మను' సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చెయ్యబోతున్నందుకు సంతోషం వెక్తం చేసింది నిర్వాణ సినిమాస్ సంస్థ.

మను సినిమాను షాట్ ఫిలిం డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించగా నరేష్ కుమారన్ సంగీతం అందించారు. విశ్వనాధ్ రెడ్డి కెమెరామెన్ గా వర్క్ చేసారు. ఇటీవల నిర్వాణ సినిమాస్ 'అర్జున్ రెడ్డి' 'అ' 'మహానటి' 'సమ్మోహనం' సినిమాలను యు.ఎస్ లో డిస్ట్రిబ్యూట్ చెయ్యడం జరిగింది.

నటీనటులు: గౌతమ్, చాందిని చౌదరి