ఘనంగా మను మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక..

  • IndiaGlitz, [Monday,September 03 2018]

షార్ట్ ఫిలిమ్స్ తో మంచి పాపులరిటీ సంపాదించుకున్న దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రాజా గౌతమ్ – చాందిని చౌదరి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా 'మను'.. ఈ నెల 7 న విడుదల కానున్న ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో క్రౌడ్ ఫండింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా.

ప్రముఖ దర్శకుడు క్రిష్ , కేరాఫ్ కంచరపాలెం మూవీ దర్శకుడు మహా వెంకటేష్ లు ముఖ్య అతిధులుగా , హీరో వరుణ్ తేజ్ వచ్చిన ఈ కార్యక్రమం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు.. పల్లకిలో పెళ్లికూతురు, బసంతి చిత్రాల తర్వాత రాజా గౌతమ్ నటిస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి..

దర్శకుడు మహా వెంకటేష్ మాట్లాడుతూ.. నా సినిమా కేరాఫ్ కంచరపాలెం కు ఈ సినిమా చాల కో ఇన్సిడెంట్ లు జరిగాయి.. ఈ రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవుతుండం కో ఇన్సిడెంట్ కాదు డెస్టినీ.. ఈ సినిమా ట్రైలర్ ని చాల బాగా డిజైన్ చేసాడు.. ఇంతవరకు అలాంటి ట్రైలర్ చూడలేదు.. ఇద్దరం కలిసి వస్తున్నాము.. ఇద్దరం కలిసి సక్సెస్ కొడదాం.. అన్నారు..

దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 7 న వస్తున్న చాల గొప్ప సిఎంమాలు.. కేరాఫ్ కంచరపాలెం.. మను.. ఈ రెండు సినిమాలు చాల గొప్ప సినిమాలు అవుతాయని నమ్మకం నాకుంది.. గౌతమ్ ఈ సినిమాలో చాల బాగా యాక్ట్ చేసాడని అనిపిస్తుంది.. ఈ సినిమా కోసం అతను చాల కష్టపడ్డాడని తెలుస్తుంది.. ఈ మను సినిమా చూస్తున్నపుడు ఎంతో థ్రిల్ గా అనిపించింది.. ఈ ట్రైలర్ చూస్తుంటే నాకు ఇలాంటి సినిమా తీయాలనిపిస్తుంది.. ఎవ్రి డిపార్ట్మెంట్ చాల హానెస్ట్ గా సినిమా తీశారు.. సినిమాకి ఫండ్ ఇచ్చిన 112 సినిమా ప్రియులకు మంచి హిట్ దక్కాలని కోరుకుంటున్నాను..

నిర్మాత సందీప్ మాట్లాడుతూ.. ఈ సినిమా టీం తో పనిచేసినందుకు చాల హ్యాపీ గా ఉంది.. అందరికి నా కృతజ్ఞతలు..సినిమా బ్యాక్ గ్రౌండ్ కానీ మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, యూ ఎస్ లో ఉంది మాకు సప్పోర్ట్ చేసిన వారికీ స్పెషల్ థాంక్స్.. మీ సపోర్ట్ తో ఇలాంటి మంచి సినిమాలు తీస్తానని అన్నారు..

నిర్మాత సృజన మాట్లాడుతూ.. మా బ్యానర్ స్టార్ట్ చేసినప్పుడే మేము ఒక మంచి సినిమా తీయాలనుకున్నాము.. అలాంటిదే మను.. ఈ సెప్టెంబర్ 7 వచ్చిన ఈ సినిమాను చూసి సక్సెస్ చేయాలనీ అందరిని కోరుకుంటున్నాను..

ఈ సందర్భంగా చిత్ర హీరో గౌతమ్ మాట్లాడుతూ.. అందరికి ఇక్కడికి వచ్చినందుకు చాల థాంక్స్.. ఈ సినిమా కి రెగ్యులర్ ప్రమోషన్స్ కన్నా స్పెషల్ ప్రమోషన్ చేయాలనుకుని డైరెక్ట్ గా జనాల దగ్గరికి వెళ్లాం.. ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు చేసిన నాకు లైఫ్ లో గుర్తుండిపోయే సినిమా ఈ మను.. ఈ సినిమా నేను చేసినందుకు చాల ఆనందంగా ఉంది.

ఈ సినిమాకు నన్ను అనుకునందుకు ఫణి కి చాల థాంక్స్.. ఫణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఒక సినిమాకి అన్ని ఆయనే అయి ఉండి చేస్తారు.. ఫాషన్ అనే పదానికి అయన కృషి సరిపోదు.. ఇంకా పెద్దది కావాలి.. పర్ఫెక్ట్ షాట్ వచ్చేతవరకు కష్టపడుతూనే ఉంటారు.. ఈ సినిమా ని మీరంతా సక్సెస్ చేయాలనీ కోరుకుంటున్నాను అన్నారు..

హీరోయిన్ చాందిని చౌదరి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.. ఈ ఈవెంట్ కి వచ్చి సినిమాకి సపోర్ట్ చేస్తున్న క్రిష్ గారికి, వరుణ్ గారి కి చాల థాంక్స్.. నిర్వాణం సినిమాస్ సందీప్ రెడ్డి గారు, సృజన గారి స్పెషల్ థాంక్స్.. మా ఈ చిన్న సినిమాకి ఇంత పెద్ద సపోర్ట్ ఇస్తున్నందుకు మా టీం రుణపడి ఉంటుంది.. ఫనీంద్ర నాకు మధురం షార్ట్ ఫిలిం ద్వారా నాకు అవకాశం ఇచ్చి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత సినిమా అవకాశం ఇచ్చినందుకు ఫనీంద్ర చాల థాంక్స్. నీలా అనే పాత్రలో నన్ను ఎంచుకున్నందుకు హ్యాపీగా ఉంది.. ఇంత మంచి సినిమలో నేను ఒక భాగమైనందుకు గర్వంగా ఉంది.. అన్నారు..

దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ .. ఇక్కడికి వచ్చినందుకు అందరికి థాంక్స్.. నేను ఎంత కష్టపడ్డాను అని చెప్పేకంటే సినిమా ఎలా ఉందొ మీరే చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం...క్రౌడ్ ఫండింగ్ అనేది తెలుగు సినిమా చరిత్రలో తొలిసారి.. గౌతమ్ సినిమా కోసం చాల బాగా పనిచేస్తాడు.. ఒక షాట్ కోసం చాల బాగా కష్టపడతాడు.

బ్రహ్మానందం గారి లాంటి స్టార్ ఆక్టర్ కొడుకులా ఎప్పుడు అనిపించలేదు.. చాందిని చౌదరి ని చాల రోజుల తర్వాత కలిశారు.. మొదటి సారి కలిసిన తర్వాత ఇప్పుడు కలిసిన తర్వాత చాల డిఫరెన్స్ వుంది.. సినిమా కోసం చాల కష్టపడింది.. మొదట నేను చుసిన కమిట్మెంట్.. ఫాషన్ ఇప్పుడు వుంది..ఈ సినిమా కి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నిషియన్, ఆర్టిస్ట్ చాల బాగా పనిచేసారు..అన్నారు..

హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను.. ఈ సినిమాకి పనిచేసిన అందరు చాల బాగా పనిచేసారు.. సినిమాటోగ్రఫీ చాల బాగుంది.. గౌతమ్ చాల కష్టపడ్డాడు.. హీరోగా నిలదొక్కుకోవాలని మొదటి నుంచి ఆయన చాల హార్డ్ వర్క్ చేసాడు.. మను సినిమా గౌతమ్ కోసం హిట్ కావాలని కోరుకుంటున్నాను.. ఇలాంటి సినిమా చాలా రేర్ గ స్తుంది.. ఇలాంటి సినిమా మంచి సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అన్నారు..