విడాకుల తర్వాత ‘మనోజ్’ తీసుకున్న నిర్ణయమిదీ..

  • IndiaGlitz, [Monday,October 28 2019]

టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ ఇటీవలే తన భార్య ప్రణతీతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కుటుంబంలో తలెత్తిన కొన్ని సమస్యల వల్ల చాలా ఇబ్బంది పడ్డానని అందుకే సామరస్యంగా ఎవరికివారుగా విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో తాను మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానని.. ఇక నటించడమే తన పనని మనోజ్ నిశితంగా వివరించాడు. అయితే అనుకున్నట్లుగానే మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. అది కూడా దీపావళి పండుగ శుభసందర్భంగా తన అభిమానులకు మనోజ్ తియ్యటి శుభవార్త చెప్పారు.

ఇదీ మనోజ్ కొత్త జర్నీ..

ఇకపై తాను సినిమాల్లో హీరోగా నటించడమే కాకుండా.. సినిమాలనూ నిర్మిస్తానని అంటే నిర్మాతగా మారుతున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా కొత్త బ్యానర్‌ను మనోజ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కాగా ఆ బ్యానర్‌కు ఎం.ఎం(మంచు మనోజ్) ఆర్ట్స్ అనే పేరు పెడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇకపై తాను ఈ బ్యానర్‌ కిందే సినిమాలు చేస్తానని.. అంతేకాకుండా కొత్త టాలెంట్‌ను బ‌య‌ట‌కు తీసుకువ‌స్తానన్నాడు. అంటే.. కొత్త నటీనటులగా మంచి అవకాశమిస్తానని చెప్పకనే చెప్పారన్న మాట. మున్ముంథు భ‌విష్యత్తులో గొప్ప సినిమాల‌ను అందించాల‌ని అనుకుంటున్నట్లు మనోజ్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి చూస్తే మంచు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ గట్టిగానే ప్రారంభించాడు. ఆల్ ది బెస్ మనోజ్.

More News

ఇంట్లో ఇల్లాలు ‘టిక్‌టాక్‌’లో ప్రియురాలు.. చివరికిలా!

ఈ మధ్యకాలంలో విపరీతంగా పాపులర్ అయిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ‘టిక్ టాక్’.

టీడీపీకి ఎమ్మెల్యే వంశీ రాజీనామా.. రాజకీయాలకు గుడ్ బై..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయ్. వైసీపీ ఊహించని విధంగా సీట్లు దక్కించుకోవడం..

రమేష్-గోపి దర్శకత్వంలో సిరిమూవీస్‌పతాకంపై కె. శిరీషా రెడ్డి నిర్మాతగా నూతనచిత్రం

ఇది నా లవ్ స్టోరీ ఫేమ్ రమేష్- గోపి దర్శకత్వంలో కొరివి పిచ్చిరెడ్డి, సరస్వతి సమర్పణలో సిరిమూవీస్ పతాకంపై కె. శిరీషారెడ్డి నిర్మాతగా రమన్,

రాంగోపాల్ వర్మచిత్రం...కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ వచ్చేస్తోంది

తన సినిమాలతోను ...సోషల్ మీడియాలో పోస్టింగులతోనూ సంచలనాలను సృష్టించే రాంగోపాల్ వర్మ పలు బయోపిక్ లు , యదార్ధ

దీపావళి సంబరాలు చేసుకున్న ప్రతిరోజు పండగే టీం

చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన