సీక్వెల్ ఆలోచనలో మనోజ్..?
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు మనోజ్ ప్రస్తుతం దశరథ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఫ్యామిలీ స్టోరీతో రూపొందుతున్న ఈ చిత్రం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రం తర్వాత మనోజ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ ఏ సినిమాకి సీక్వెల్ అనుకుంటున్నారా..? మనోజ్ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచిన బిందాస్ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడట.
బిందాస్ డైరెక్టర్ వీరు పోట్ల ఇప్పటికే బిందాస్ సీక్వెల్ కి స్టోరీ రెడీ చేసాడట. బిందాస్ చిత్రాన్ని నిర్మించిన ఎకె ఎంటర్ టైన్మెంట్ సంస్థే బిందాస్ సీక్వెల్ కూడా నిర్మించడానికి ప్లాన్ చేస్తుందట. మనోజ్...దశరథ్ తో చేస్తున్న సినిమా పూర్తయ్యాకా బిందాస్ సీక్వెల్ స్టార్ట్ చేస్తారని సమాచారం. మరి... బిందాస్ తో సక్సెస్ సాధించిన మనోజ్, వీరుపోట్ల టీం బిందాస్ సీక్వెల్ తో కూడా సక్సెస్ సాధిస్తారని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com