జీవితాంతం గుర్తు పెట్టుకునే సినిమా - మనోజ్
Send us your feedback to audioarticles@vaarta.com
నేను మీకు తెలుసా సినిమాను తమిళంలో నాన్ ఉనకు తెరియుమా సినిమాతో తమిలంలో ఇంట్రడ్యూస్ అయిన మంచు మనోజ్ మరే తమిళ చిత్రం కూడా తమిళంలో చేయలేదు. ఇప్పుడు `ఒక్కడు మిగిలాడు` సినిమాతో మరోసారి స్ట్రయిట్ తమిళ సినిమా చేశాడు.
నాన్ తిరింబి వరువేన్ అనే పేరుతో సినిమా తమిళంలో విడుదల కానుంది. ఈ సినిమా సెప్టెంబర్ 8న తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల కానుంది. కొత్తదనం ఉన్న కథలకు తమిళంలో ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. నాకు తమిళ సినిమా రంగం అంటే చాలా ఆసక్తి. నేను చెన్నైలోనే పుట్టి పెరిగాను. తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమా ఒకేసారి విడుదల కావాలంటే మంచి కథ అవసరం అని వెయిట్ చేశాను.
అజయ్ అండ్రూస్ చెప్పిన కథ వినగానే చాలా ఎగ్జయిట్ అయ్యాను. తమిళుల స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన ఓ నాయకుడి పాత్రలో నటించడం ఆనందంగా ఉంది. జీవితాంతం గుర్తుపెట్టుకునే సినిమా అవుతుందనడంలో సందేహం లేదు అంటూ `ఒక్కడు మిగిలాడు` తమిళవెర్షన్ నాన్ తిరింబి వరువేన్(నేను తిరిగి వస్తాను).సినిమా చెన్నై వేడుకలో మనోజ్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com