'దేవి శ్రీ ప్రసాద్' క్యారెక్టర్స్ ప్రధానంగా సాగే చిత్రం - మనోజ్ నందం
Send us your feedback to audioarticles@vaarta.com
యశ్వంత్ మూవీస్ సమర్పణలో ఆర్.ఒ.క్రియేషన్స్ బేనర్‌పై రూపొందిన చిత్రం 'దేవిశ్రీ ప్రసాద్'. పూజా రామచంద్రన్, భూపాల్‌రాజు, ధనరాజ్, మనోజ్ నందం ప్రధాన పాత్రధారులు. శ్రీ కిషోర్ దర్శకుడు. డి.వెంకటేష్, ఆర్.వి.రాజు, ఆక్రోష్ నిర్మాతలు. ఈ సినిమా నవంబర్ 10న విడుదలకానుంది.
ఈ సందర్భంగా .......
మనోజ్ నందం మాట్లాడుతూ - "గత ఏడాది నవంబర్‌లో 'దేవి శ్రీ ప్రసాద్' సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేశాం. సినిమా 25 రోజుల్లో పూర్తయ్యింది. అయితే చిన్న నిర్మాతలు, చిన్న చిన్న సమస్యలు కారణంగా సినిమా విడుదల ఆలస్యమైంది. ఆ సమయంలో డి.వి.క్రియేషన్స్ వెంకటేష్‌గారు సినిమా చూశారు. ఆయనకు సినిమా బాగా నచ్చింది. కమర్షియల్ యాంగిల్‌లో సినిమా బాగా వర్కవుట్ అవుతుందనిపించడంతో..ఆయన సినిమాను విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. కథ ముందు ధనరాజ్ చెప్పాడు. దర్శకుడు శ్రీ కిషోర్ హాంగ్ కాంగ్‌లో డ్యాన్స్ కొరియోగ్రాఫర్. ఆయన ఫోన్‌లో మళ్లీ నాకు ఈ కథను వినిపించారు.
సినిమాలోని మూడు రోల్స్‌కు నేను, ధనరాజ్ అన్న ఒకే అనుకున్నాం. అయితే మూడో రోల్ ఎవరు చేస్తే బావుంటుందని ఆలోచించాం. చివరకు భూపాల్ అయితే సరిపోతాడనిపించింది. ఇక లీల పాత్ర కోసం పదిహేను మంది అమ్మాయిలను సంప్రదించారు. అయితే అందరూ ఎలా తీస్తారోనని ఆలోచించుకుని వద్దని అనుకున్నారు. ఆ సమయంలో పూజా రామచంద్రన్‌కు కథను వినిపించాం. ఈ సినిమా అంతా దర్శకుడి హార్డ్‌వర్క్ అని చెప్పాలి. ఏదో నాలుగు ఫైట్స్, నాలుగు సాంగ్స్ అనే కాకుండా కొత్తగా సినిమా చేయాలని శ్రీకిషోర్ ఆలోచించి ఈ కథను సిద్ధం చేశారు. ఇదొక కల్ట్ మూవీ అని చెప్పాలి. అక్రోష్‌గారు, రాజుగారు డబ్బులు గురించి ఆలోచించకుండా ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. సినిమాటోగ్రాఫర్ ఫణి మంచి విజువల్స్ అందించారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కమ్రాన్‌గారు తన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సినిమాకు ప్రాణం పోశారు.
సినిమా ప్రారంభంలో నాకు మనసులో ఎక్కడో చిన్నపాటి భయం ఉండేది. కానీ సినిమా చూసిన తర్వాత హ్యాపీగా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ సినిమాలో భూపాల్ చేసిన దేవి అనే యువకుడి పాత్ర నెగటివ్ టచ్‌లో ఉంటుంది. ధనరాజ్ అన్న చేసిన శ్రీ పాత్ర గోడ మీద పిల్లిలా ఉంటుంది. ప్రసాద్ అనే పాజిటివ్ థింకింగ్ ఉన్న యువకుడి పాత్రలో నేను కనపడతాను. మూడు పాత్రల మధ్య జరిగిన అసాధారణ ఘటన వల్ల ఎలాంటి పరిణామాలు జరిగాయనేదే కథ. క్యారెక్టరైజేషన్స్ బేస్డ్‌గా సాగే సినిమా ఇది. మనసైనోడు చిత్రాన్ని ఈ నవంబర్‌లో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అలాగే వీరభోగ వసంతరాయులు చిత్రంలో మంచి పాత్రలో కనపడతాను. మహేష్‌గారి సినిమాలో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments