శౌర్య సినిమా చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నాను - హీరో మంచు మనోజ్
Send us your feedback to audioarticles@vaarta.com
రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు చేస్తూనే...నేను మీకు తెలుసా, ప్రయాణం, వేదం...ఇలా విభిన్న కథా చిత్రాలు చేస్తున్నహీరో మంచు మనోజ్. సురక్ష ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై మనోజ్ - రెజీనా జంటగా నటించిన తాజా చిత్రం శౌర్య. ఈ చిత్రాన్ని దశరథ్ తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా శౌర్య సినిమాని ఈనెల 4న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో మంచు మనోజ్ తో ఇంటర్ వ్యూ మీకోసం...
శౌర్య లో మీ లుక్ కొత్తగా ఉంది. ఈ లుక్ కోసం బాగా కష్టపడ్డారా..?
ఇప్పటి వరకు నేను చేసిన చిత్రాల్లో రఫ్ గా కనిపించాను. ఇది డిఫరెంట్ మూవీ. ఇందులో అసలు ఫైట్స్ ఉండవు. అందుకని నా లుక్ కూడా కొత్తగా ఉండాలని ఇలా ట్రై చేసాం. ఈ లుక్ కోసం 8 కేజీలు పెరిగాను. శౌర్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగానే మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై మరింత నమ్మకం పెరిగింది.
మనోజ్ అంటేనే ఎనర్జి..అలాంటిది ఈ సినిమాలో ఫైట్స్ లేకపోతే ప్రేక్షకులు ఫీలవుతారేమో..?
ఇది ఒక థ్రిల్లింగ్ లవ్ స్టోరి. సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ అనేదే ఉండదు.అసలు ఇందులో ఫైట్స్ లేవే అనే ఫీలింగే కలగదు. అందుచేత ఆడియోన్స్ కి ఖచ్చింతగా నచ్చుతుంది.
శౌర్య లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు శౌర్య. క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే...అతని మనసులో ఏం ఉన్నా బయటకు చెప్పడు. ఇంకా చెప్పాలంటే..డైరెక్టర్ దశరథ్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో...నేను ఈ సినిమాలో అలా కనిపిస్తాను. దశరథ్ గారు ప్రతి క్యారెక్టర్ కి ఎలా నటించాలో...తనకు కావలసింది ఏమిటో బాగా వివరిస్తారు. అందుచేత నా క్యారెక్టర్ గురించి కూడా బాగా వివరించడంతో...ఆయన చెప్పినట్టు ఫాలో అయిపోయాను.
మీ క్యారెక్టర్ లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయని విన్నాం..?
ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటుంది. అలాగే నా క్యారెక్టర్ లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. కొత్తగా ట్రై చేసాం. డిఫరెంట్ షేడ్స్ ఏమిటనేది నేను చెప్పడం కన్నా తెరపై చేస్తే బాగుంటుంది. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే శౌర్య సినిమా చేసానని గర్వంగా ఫీలవుతాను.
రెజీనా క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
రెజీనా క్యారెక్టర్ పేరు నేత్ర. ఈ పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. పాత్రకు తగ్గట్టు రెజీనా చాలా బాగా నటించింది.
శ్రీ నుంచి శౌర్య వరకు దశరథ్ లో మీరు గమనించింది ఏమిటి..?
శ్రీ టైమ్ లో ఇద్దరం బ్యాచిలర్స్. ఇప్పుడు ఇద్దరకి మ్యారేజ్ అయిపోయింది. (నవ్వుతూ...) శ్రీ టైం లో మా బ్యాచ్ అంతా దశరథ్ ని గురు అని పిలిచేవాళ్లం. మా బ్యాచ్ కి బాగా క్లాస్ తీసుకునేవారు. అప్పటి నుంచి దశరథ్ తో రిలేషన్ కంటిన్యూ అవుతుంది. ఛేంజ్ అంటే సెట్స్ లో అప్పటి కన్నా ఇప్పుడు బాగా కాన్పిడింట్ గా ఉంటున్నారు. అంతకు మించి ఆయనలో పెద్దగా ఛేంజ్ ఏమీ లేదు.
దశరథ్ సినిమా అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి కదా..మరి ఇందులో..?
ఇందులో కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. అలాగే యూత్ కావల్సిన అంశాలు ఉంటాయి. ఇంతకు ముందు చెప్పినట్టు సినిమా చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకు ఇంట్రస్టింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది.
నేను మీకు తెలుసా, ప్రయాణం, వేదం...ఇలా డిఫరెంట్ మూవీస్ చేసారు కదా..ఈ సినిమా కూడా ఇప్పుడు కావాలని ప్లాన్ చేసి చేసారా..?
ఈ టైంలో ఇలా చేయాలని ప్లాన్ చేసి ఏదీ చేయను. ఈ సినిమా కూడా ఎటాక్ సినిమా చేసిన తర్వాత దశరథ్ వచ్చి ఒక డిఫరెంట్ స్టోరి ఉంది ఫైట్స్ ఉండవు వింటారా అని అడిగాడు. ఇంట్రస్టింగ్ గా ఉంటే చేస్తాను వచ్చి కథ చెప్పమన్నాను. 30 నిమిషాలు చాలా క్లియర్ గా కథ చెప్పాడు. నాకు బాగా నచ్చింది వెంటనే మనం ఈ సినిమా చేస్తున్నాం అన్నాను అంతే తప్పా...కావలని ప్లాన్ చేసి చేసింది కాదు. కథ చెప్పిన దాని కన్నా చాలా బాగా తీసాడు. సినిమా చూసిన తర్వాత ఈ పాయింట్ ని కమర్షియల్ గా ఇంత బాగా భలే తీసాడే అంటారు.
నాన్నగారు సినిమా చూసారు కదా..ఏమన్నారు..?
నాన్నగార్కి అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ సినిమా బాగా నచ్చింది. ఈ సినిమాలో నేను చాలా సెటిల్డ్ గా నటించాను. దశరథ్ చాలా బాగా తీసాడంటూ పొగిడారు.
శౌర్యతో నాలుగు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి కదా ఎలా ఫీలవుతున్నారు..?
సినిమా బాగుంటే ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా చూస్తున్నారు. నా సినిమాతో పాటు కళ్యాణ వైభోగమే, గుంటూరు టాకీస్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. నందినీ రెడ్డి, ప్రవీణ్ సత్తార్ నాకు బాగా తెలుసు. వాళ్ల సినిమాలు కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీ ఇంతకు ముందులా లేదు చాలా మారింది.
ఈమధ్య ఎక్కువుగా క్యాస్ట్ కి - డ్రగ్స్ కి దూరంగా ఉండండి అని చెబుతున్నారు కారణం..?
ఎక్కడికి వెళ్లినా క్యాస్ట్ అనేది వినిపిస్తుంది. ఒక్క రంగమనే కాదు ప్రతి రంగంలో ఇదే ఉంది. అందుకనే క్యాస్ట్ కి - డ్రగ్స్ కి దూరంగా ఉండండి అని చెబుతున్నాను. ఏ సినిమాని క్యాస్ట్ తో లింకి పెట్టి చూడకండి. ఒక్క సినిమా బయటకు రావాలంటే ఒక్క క్యాస్ట్ వల్లే అవ్వదు. ఈ విషయాన్ని తెలుసుకోవాలని చెబుతున్నాను.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
రమేష్ పుప్పాల తో సినిమా చేయాలి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఏప్రిల్ లో కొత్త సినిమా ప్రారంభిస్తాను. ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపిస్తాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout