అప్పు చేసి సినిమా చేస్తున్న మనోజ్!!
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు మోహన్‌బాబు తనయుల్లో రెండో వాడైన మంచు మనోజ్ నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. హీరోగా, యాక్షన్ మాస్టర్‌గా ఇలా పలు అవతారాలెత్తిన మనోజ్.. ఇప్పుడు ఏకంగా నిర్మాతగా మారారు. తను హీరోగా నటిస్తున్న అహం బ్రహ్మాస్మి చిత్రాన్ని మనోజ్ నిర్మిస్తుండటం విశేషం. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో మంచు మనోజ్ తను నిర్మాతగా మారవడం వెనుక ఉన్న కారణాన్ని చెప్పారు. అహం బ్రహ్మాస్మి కథను మరో నిర్మాత మనోజ్ దగ్గరకు తీసుకొచ్చాడు. అయితే తనకు హిట్స్ లేవు. తను సినిమా చేస్తే ఎవరు కొనకపోతే నిర్మాత నష్టపోతాడని భావించి తానే ఆ సినిమాను నిర్మించాలని మనోజ్ అనుకున్నాడట. ఆ విషయాన్ని మనోజ్ సదరు కథ తెచ్చిన నిర్మాతకు చెప్పి ఈ సినిమా హిట్ అయితే ఆయనకు మరో సినిమా చేస్తానని చెప్పాడట.
ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి పాన్ ఇండియా రేంజ్‌కు పెరిగిపోవడంతో కేవలం సినిమాను తెలుగులోనే చేయాలని కాకుండా తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ రూపొందిస్తు్నాడట. అయితే ఇంత భారీ బడ్జెట్ సినిమా కోసం తండ్రి మోహన్‌బాబు దగ్గర డబ్బు తీసుకోకుండా అప్పు తెచ్చి సినిమా చేస్తున్నాని మనోజ్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments